Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అగ్రగామి ఆరోగ్య సేవల సదుపాయకుడు ప్రిస్టిన్ కేర్ దక్షిణ భారతదేశంలో 5 లక్షలకు పైగా రోగులతో ముఖాముఖి అయింది. అగ్రగామి మార్కెట్లలో దక్షిణ భారతదేశంలోని టైయర్ 1 మరియు టైయర్ 2 నగరాలలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, మధురై, కోయంబత్తూరు, తిరువనంతపురం, కోజికోడ్, మైసూరు, విజయవాడ మరియు విశాఖపట్నం ఉన్నాయి. రోగులతో ఈ సంప్రదింపులలో ఎక్కువ భాగం ప్రాక్టాలజీ, యూరాలజీ మరియు ఈస్థటిక్స్కు సంబంధించినవే ఉన్నాయి. కంపెనీ 2023 చివరి నాటికి దక్షిణ భారతదేశంలోని 300 ఆసుపత్రులు మరియు 100 క్లినిక్లకు విస్తరిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ విస్తరణ దాని నెట్వర్క్ ఆసుపత్రులకు మొత్తం సంఖ్యను 500 మరియు క్లినిక్లను 150కు విస్తరించనుంది. కంపెనీ సాధారణ శస్త్రచికిత్సలు, ఆప్తమాలజీ, ఈఎన్టీ, యూరాలజీ, గైనకాలజీ తదితర విభాగాలలో పని చేస్తోంది మరియు దంత సంరక్షణకు విస్తరించే వ్యూహాలను కలిగి ఉంది.
ఈ విస్తరణ గురించి ప్రిస్టిన్ కేర్ సహ-వ్యవస్థాపకుడు హర్సిమర్బిర్ సింగ్ మాట్లాడుతూ, ‘‘స్పల్ప కాలంలోనే మేము సెకండరీ కేర్ సర్జరీలలో నాయకునిగా వృద్ధి చెందాము. మేము ఆరోగ్య సేవా వ్యవస్థలో లోతుగా విస్తరించేందుకు కట్టుబడి ఉన్నాము మరియు దేశవ్యాప్తంగా మా వ్యాప్తిని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నాము. దక్షిణ భారతదేశంలో 5 లక్షలకు పైచిలుకు రోగుల సంప్రదింపులతో మేము కొత్తగా పలువురు యువతను చేరుకునే మైలు రాయిని చేరుకున్నాము. మేము స్థిరమైన నాణ్యత మరియు మెరుగైన శస్త్రచికిత్స సంరక్షణను అందించేందుకు మరియు దేశంలోని ప్రతి ప్రాంతంలో అత్యాధునిక ఆరోగ్య సేవల సౌకర్యాలను అందించే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము’’ అని వివరించారు.