Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
గురుగ్రామ్, 13 జనవరి 2023 : భారతదేశంలో అతిపెద్ద కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ బ్రాండ్ , శాంసంగ్ తమ అతున్నత శ్రేణి , ప్రీమియం సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ శ్రేణి ని 2023 కోసం విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నూతన శ్రేణి రిఫ్రిజిరేటర్లను 100% భారతదేశంలో తయారుచేశారు. దీనిలో భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైన ఫీచర్లను , వినియోగదారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తీర్చిదిద్దారు. ఇవి వినియోగదారుల జీవితాలను మరింత ఉత్తమంగా, సౌకర్యవంతంగా మార్చనున్నాయి. ఈ పూర్తి సరికొత్త ఐఓటీ ఆఽధారిత శ్రేణిని ఆలోచనాత్మకంగా నూతన తరపు భారతీయ వినియోగదారుల నిర్థిష్టమైన రిఫ్రిజిరేషన్ అవసరాలకు తగినట్లుగా తీర్చిదిద్దారు. వీటిలో అనుకూలీకరించబడిన స్టోరేజీ, అత్యంత అందమైన ఎక్స్టీరియర్స్, కనెక్టడ్ లివింగ్‌తో సౌకర్యం, ఎన్నటికీ ముగియని వినోదం, అతి తక్కువ విద్యుత్ వినియోగం, తదితర అంశాలతో వస్తాయి.
మొట్టమొదటిసారిగా ఈ నూతన శ్రేణిలో అన్ని మోడల్స్ వై–ఫై ఆధారితం మరియు స్మార్ట్ థంగ్స్ యాప్‌తో మిళితమై ఉంటుంది. ఇది శాంసంగ్ యొక్క పవరింగ్ డిజిటల్ ఇండియా విజన్‌ను బలోపేతం చేస్తుంది. కన్వర్టబల్ 5 ఇన్ 1 మోడ్‌తో ఇది వస్తుంది. దీనిలో అనుకూలీకరించబడిన స్టోరేజీ స్పేస్ ఉంది. శాంసంగ్ యొక్క ట్విన్ కూలింగ్ ప్లస్ సాంకేతికత కారణంగా ఖచ్చితమైన కూలింగ్ లభిస్తుంది మరియు దీనిలోని కర్డ్ మెస్ట్రో , వినియోగదారులు పెరుగును అత్యంత ఆరోగ్యవంతమైన మరియు పరిశుభ్రమైన మార్గంలో తయారుచేసేందుకు వీలు కల్పిస్తుంది. రిఫ్రిజిరేటర్లో ప్రాంగణాన్ని అత్యుత్తమంగా వినియోగించుకునేందుకు, వినియోగదారులు ఇప్పుడు కర్డ్ మేకింగ్ కంపార్ట్మెంట్ను వినియోగించనప్పుడు వేరు చేయవచ్చు.
ఈ నూతన శ్రేణిలో శాంసంగ్, మొట్టమొదటిసారిగా, తమ అత్యాధునిక ప్రొప్రైయిటరీ సాంకేతికతలను రిఫ్రిజిరేటర్లలో నూతన బెంచ్‌మార్క్‌లను సృష్టించేందుకు తీసుకువచ్చింది. బీస్పోక్ గ్లాస్ ఫినీష్ కారణంగా వీటి అందం మరింతగా పెరుగుతుంది మరియు ఐఓటీ ఆధారిత ఫ్యామిలీ హబ్ 7.0 అపరిమిత వినోదం మరియు కనెక్టడ్ లివింగ్ అనుభవాలను సైతం అందిస్తుంది. నేటి తరపు వినియోగదారుల డిజైన్ అభిరుచులను తీర్చడం మరీ ముఖ్యంగా తాము చేసే ప్రతి పనిలోనూ తమదైన శైలి పలికించాలని కోరుకునే వారికోసం, 2023 సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు నాలుగు బీస్పోక్ గ్లాస్ ఫినీష్ అవకాశాలు – గ్లామ్ డీప్ చార్కోల్, క్లీన్ వైట్, క్లీన్ నేవీ, క్లీన్ పింక్‌లో వస్తాయి. కనెక్టడ్ లివింగ్ అనుభవాలను అందించేందుకు ఈ రిఫ్రిజిరేటర్లు ఫ్యామిలీ హబ్ 7.0తో వస్తుంది. ఇది వారి స్మార్ట్ ఉపకరణాలను స్మార్ట్‌థింగ్స్ యాప్ ద్వారా నియంత్రించే అవకాశం అందిస్తుంది. ఇది అపరిమత వినోదం, రెసిపీ సూచనలను, ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచిన పదార్థాల ఆధారంగా అందించడంతో పాటుగా ఆహార ఎక్సైపరీ మరియు మరెన్నో అందిస్తుంది.
ఈ నూతన శ్రేణి ఏఐ ఎనర్జీ సేవింగ్ మోడ్ తో వస్తుంది. ఇది వై–ఫై ఆధారిత మెషీన్ లెర్నింగ్‌తో వస్తుంది . ఇది ఫ్రిడ్జ్ మరియు ఫ్రీజర్ ఉష్ణోగ్రతలను మెరుగ్గా నిర్వహించడంతో పాటుగా 10% వరకూ అదనపు విద్యుత్ పొదుపు అందిస్తుంది. ఈ పరిశ్రమలో మొట్టమొదటిసారిగా ఆటో ఓపెన్ డోర్ ఫీచర్, దీని యొక్క టచ్ సెన్సార్ తో వస్తుంది. ఈ ఫీచర్ కారణంగా మృదువుగా డోర్ నొక్కిన వెంటనే అది తెరుచుకుంటుంది. అందువల్ల చేతులు మురికి ఉన్నట్లయితే, వారు తమ చేతులను డోర్ సెన్సార్‌పై పెడితే డోర్ తెరుచుకుంటుంది. ఈ నూతన శ్రేణి , ఇటీవలనే పరిశ్రమలో మొట్టమొదటి సారిగా డిజిటల్ ఇన్వర్టర్ మోటర్ కంప్రెసర్‌పై ప్రకటించిన 20 సంవత్సరాల వారెంటీతో వస్తుంది. తద్వారా ఉత్పత్తి మన్నికకు భరోసా అందించడంతో పాటుగా వినియోగదారులకు పూర్తి ప్రశాంతత అందిస్తుంది. ‘‘మా నూతన 2023 సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ శ్రేణిని మూడు ముఖ్యమైన భారతీయ వినియోగదారుల అవసరాలు – సీజన్‌కు అనుగుణంగా విభిన్నమైన రిఫ్రిజిరేషన్ అవసరాలు కోసం కస్టమైజబల్ స్టోరేజీ లేదా కిచెన్ డెకార్‌కు అందం జోడించే సౌందర్యం మరియు కనెక్టడ్ లివింగ్ ద్వారా సౌకర్యం. విద్యుత్ పొదుపుతో పాటుగా 20 సంవత్సరాల వారెంటీతో వస్తున్న ఈ రిఫ్రిజిరేటర్లు , ఆధునిక భారతీయ వినియోగదారులకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. మేము భారీ డిమాండ్ ఈ రిఫ్రిజిరేటర్లకు వస్తుందని ఆశిస్తున్నాము మరియు సైడ్ బై సైడ్ లైనప్‌తో ఈ విభాగం పరిశ్రమలో 100% వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము’’ అని మోహన్‌దీప్ సింగ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ బిజినెస్, శాంసంగ్ ఇండియా అన్నారు.
ధర మరియు లభ్యత
ప్రారంభ ధర 1,13,000 రూపాయలతో ఈ నూతన శ్రేణి నేటి నుంచి భారతదేశ వ్యాప్తంగా ఆఫ్‌లైన్ మరియు ఆన్లైన్ రిటైలర్ల వద్ద 635లీటర్ సామర్ధ్యంతో నాలుగు బీస్పోక్ గ్లాస్ ఫినీష్ రంగుల అవకాశాలలో –గ్లామ్ డీప్ చార్కోల్ , క్లీన్ వైట్, క్లీన్ నేవీ మరియు క్లీన్ పింక్‌లో లభ్యమవుతుంది.
వారెంటీ
ఈ నూతన శ్రేణి, భారతదేశంలో పూర్తి విద్యుత్ ఆదా సౌకర్యాలతో వస్తుంది. ఇది మొట్టమొదటి స్టార్ రేటెడ్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్, ఇది 20 సంవత్సరాల కంప్రెషర్ వారెంటీ తో వస్తుంది. కంప్రెషర్‌పై ఈ వారెంటీతో ఈ ఉత్పత్తి మన్నికకు భరోసా కలుగుతుంది. ఇది వినియోగదారులకు పూర్తి మనశ్శాంతిని అందిస్తుంది.
సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ల లో అత్యంత కీలకమైన ఫీచర్లు...
కన్వర్టబల్ 5 ఇన్ 1 మోడ్
ఈ ఫీచర్ వినియోగదారులకు మరింత స్టోరేజీ ప్రాంగణం మరియు సౌకర్యంను అందించడంతో పాటుగా ఐదు మోడ్స్ – నార్మల్, సీజనల్, ఎక్స్ట్రా ఫ్రిడ్జ్, వెకేషన్ మరియు హోమ్ ఎలోన్ నుంచి ఎంచుకునే అవకాశం ఉంది. ఈ రిఫ్రిజిరేటర్లో ఫ్రిడ్జ్, ఫ్రీజర్ మోడ్ రెండూ కూడా హోమ్ ఎలోన్ మరియు వెకేషన్ మోడ్‌లో ఉన్నాయి. ఈ రిఫ్రిజిరేటర్లో ఫ్రిడ్జ్ టర్న్ ఆఫ్ అయితే ఫ్రీజర్ నడుస్తుంది. తమ రిఫ్రిజిరేటర్లో అదనపు స్టోరేజీ స్పేస్ కావాలనుకుంటే, ఈ ఫీచర్లో వినియోగదారులు తమ ఫ్రీజర్‌ను ఫ్రిడ్జ్‌గా కన్వర్ట్ చేయవచ్చు. అందువల్ల మరింత అదనపు ప్రాంగణం లభిస్తుంది.
దీనిలోని ట్విన్ కూలింగ్ప్లస్ టెక్నాలజీ ఫీచర్ రెండు ప్రత్యేక ఎవాపరేటర్స్తో కలిసి పనిచేస్తుంది. దీనితో ఫ్రిడ్జ్ మరియు ఫ్రీజర్ లో ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు తగ్గుతాయి. ఈ ఆవిష్కరణ నూతన స్థాయి సౌకర్యం అందిస్తుంది. ఇది మెరుగైన తేమ నియంత్రణకు తోడ్పడటంతో పాటుగా ఉష్ణోగ్రతను సైతం నియంత్రించి చెడు వాసనలు కలవడాన్ని నివారిస్తుంది. ఇది అధిక కాలం ఆహారం తాజాగా ఉండేందుకు తోడ్పడుతుంది.
ఫ్యామిలీ హబ్ 7.0
ఫ్యామిలీ హబ్ 7.0 ఫీచర్, అత్యంత సమర్ధవంతమైన రీతిలో ఆహార నియంత్రణకు తోడ్పడటంతో పాటుగా తమ వినియోగదారులకు ఫ్రిజ్ లోపల ఏముందో చూసే అవకాశమూ అందిస్తుంది. వినియోగదారులు తమ అభిమాన సంగీతంను స్పాటిఫై, ట్యూన్ ఇన్ వినియోగించి ప్లే చేయడంతో పాటుగా తమ అభిమాన వెబ్ సిరీస్‌ను ఇతర ఉపకరణాలను వినియోగించకుండానే ఆస్వాదించవచ్చు. కుటుంబవినోదం ఎన్నటికీ ముగియదని భరోసా అందిస్తూ , ఈ ఫీచర్ అనలాగ్ బులెటిన్ బోర్డ్ ను సైతం అందిస్తుంది. ఇది వీడియో, ఫోటోలు, మోమోస్ ద్వారా కుటుంబ క్షణాలను ఆస్వాదించవచ్చు. సౌకర్యవంతమైన కనెక్టడ్ లివింగ్ ఆస్వాదించడం మరియు తమ ఇంటిని స్మార్టర్‌గా మలచడంలో భాగంగా ఈ ఫీచర్ స్మార్ట్ థంగ్స్యాప్ ద్వారా తమ స్మార్ట్ అప్లయెన్సస్ మరియు ఐఓటీ ఆధారిత ఉపకరణాలను నియంత్రించడం చేస్తుంది.
ఏఐ ఎనర్జీ సేవింగ్స్ మోడ్
ఈ మోడ్ ఆన్ చేస్తే, వినియోగదారులు అత్యంత సులభంగా తమ నెలవారీ ఖర్చు లక్ష్యాలను తమ ఫ్రిడ్జ్, ఫ్రీజర్ ఉష్ణోగ్రతలను నియంత్రించడం ద్వారా చేయవచ్చు.ఈ ఫీచర్ ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ వినియోగించుకుని , వినియోగవిధానం అర్ధం చేసుకుని తదనుగుణంగా ఉష్ణోగ్రతను ఉంచుతుంది. తద్వారా విద్యుత్ ఆదాకు భరోసా అందిస్తుంది.
కర్డ్ మెస్ట్రో
ఈ నూతన శ్రేణి శాంసంగ్ యొక్క పేటెంటెడ్ కర్డ్ మెస్ట్రో సాంకేతికతతో వస్తుంది. ఇది వినియోగదారులకు తమ ఇంటిలోనే పెరుగును ఆరోగ్యవంతంగా, పరిశుభ్రమైన రీతిలో చేసుకునేందుకు తోడ్పడుతుంది. అయితే, గత అనుభవాలను పరిగణలోకి తీసుకుని 2023 శ్రేణి డిటాచబల్ కర్డ్ మెస్ట్రోతో వస్తుంది. వినియోగదారులు తమ సౌకర్యానికి అనుగుణంగా దానిని తొలగించుకోవచ్చు, అతి సులభంగా ఈ దిగువ స్టెప్స్ అనుసరించడం ద్వారా వినియోగదారులు అతి సులభంగా ట్రేను తొలగించడంతో పాటుగా అదనపు స్పేస్ ఆస్వాదించవచ్చు. అనుసరించాల్సిన స్టెప్స్ ...
ఇన్నర్ ఎల్ఈడీ డిస్ప్లే ద్వారా కర్డ్ ఆఫ్ మోడ్‌కు మారాలి
కర్డ్ మెస్ట్రో ప్లస్ వెనుక వైపు స్ర్కూ వదులుచేయాలి
ఫ్రిడ్జ్ నుంచి దీనిని బయటకు తీయడంతో పాటుగా వెనుక వైను విద్యుత్ వైర్ తొలగించాలి
ఇప్పుడు మరింత ఫ్రిడ్జ్ స్పేస్‌ను ఈ అభిమాన కూరగాయలు, ఇతర పదార్ధాల నిల్వ కోసం వాడుకోవచ్చు.
బీస్పోక్ మరియు ఆటో ఓపెన్ డోర్
రూపకల్పన కోణం నుంచి చూస్తే, ఈ నూతన శ్రేణి, బీస్పోక్ గ్లాస్ ఫినీష్ ప్యానెల్స్‌తో వస్తాయి. ఇది ఈ శ్రేణి రిఫ్రిజిరేటర్లను అత్యంత అందంగా మలుస్తాయి. భారతీయ కుకింగ్‌లో సవాళ్లను పరిగణలోకి తీసుకుని 2023 శ్రేణి మరో ఆసక్తికరమైన ఫీచర్– ఆటో ఓపెన్ డోర్‌తో వస్తుంది. ఇది టచ్ సెన్సార్ వినియోగించడంతో పాటుగా ఎలాంటి ఫిజికల్ టచ్ లేకుండా డోర్ తెరిచేందుకు సహాయపడుతుంది. అందువల్ల, మురికి చేతులు అయినప్పుడు, ఒకరు తమ చేతిని డోర్ సెన్సార్ దగ్గర ఉంచితే డోర్ తెరుచుకుంటుంది.
నాన్ ప్లంబింగ్ డిస్పెన్సర్
ఈ రిఫ్రిజిరేటర్ 4.5లీటర్ వాటర్ ట్యాంక్‌తో వస్తుంది. దీనియొక్క నాన్ ప్లంబింగ్ ఐస్ మరియు వాటర్ డిస్పెన్సర్ కోసం ఇది తోడ్పడుతుంది. ఈ ఫీచర్, ఈ రిఫ్రిజిరేటర్‌ను ఏ ప్రాంతంలో అయినా అతి సులభంగా నీటి సరఫరా లేకపోయినప్పటికీ ఇన్స్టాల్ చేయడానికి తోడ్పడుతుంది. వినియోగదారులు కేవలం మినరల్ లేదా ఫ్రెష్ వాటర్ ను జోడించి చల్లటి నీరు లేదా ఐస్ లేదా క్రష్డ్ ఐస్‌ను ప్రత్యేక వాటర్ ఫిల్టర్ అవసరం లేకుండానే పొందవచ్చు.
వై–పై ఆధారితం
వినియోగదారులు తమ రిఫ్రిజిరేటర్‌ను స్మార్ట్థంగ్స్ యాప్ వినియోగించి నియంత్రించవచ్చు. ఈ రిఫ్రిజిరేటర్ వై–ఫై ఆధారితంగా ఉంటుంది.