Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : డల్లాస్ వెంచర్ క్యాపిటల్‌తో టి హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇండియా ఫండ్ పేరుతో టీ హబ్‌కి డల్లాస్ వెంచర్ క్యాపిటల్ డబ్బులు ఇవ్వనుంది. శుక్రవారం టి హబ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డల్లాస్ వెంచర్ సంస్థకు కెటిఆర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. డల్లాస్ వెంచర్ సంస్థ భారత్‌లో అనేక స్టార్టప్స్ నెలకొల్పిందని గుర్తు చేశారు. భారత్‌లో ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన గొప్పదని కొనియాడారు. హైదరాబాద్‌లో సుమారు 6 వేల స్టారప్లు ఉన్నాయన్నారు. భారత్ ఆర్థికంగా వద్ధి చెందుతుందన్నారు. భారత్‌కు పెట్టుబడులు రాబట్టడం కష్టం కాదన్నారు. మంచి ఆలోచన ఉన్న స్టార్టప్‌లకు నిధులు ఇబ్బంది కాదన్నారు. మంచి ఆలోచన ఉన్న స్టార్టప్‌లకు నిధులు ఇబ్బంది కాదన్నారు. అయితే.. డబ్బు వథా కాకుండా వ్యాపారాన్ని ఎలా వద్ధి చేస్తారనేదే స్టార్టప్‌లకు ముఖ్యమైన అంశమన్నారు. భారత్‌లో తొలి ప్రయివేటు రాకెట్ టిహబ్ నుంచే వచ్చిందన్నారు. ఈ సమావేశంలో ఐటి, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, డల్లాస్ ప్రతినిధులు, టిహబ్ అధికారులు పాల్గొన్నారు.