Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మణిపాల్ గ్లోబల్ స్కిల్స్ అకాడమీ వెల్లడి
హైదరాబాద్ : నేషనల్ సేల్స్ అకాడమీని ప్రారంభించడం ద్వారా ఉపాధి పొందగల నైపుణ్యం పొంద కలిగిన నిపుణులను భారీగా సష్టించనున్నామని మణిపాల్ గ్లోబల్ స్కిల్స్ అకాడమీ (ఎంజిఎస్ఎ) పేర్కొంది. తమ ఈ సంస్థ ద్వారా దేశంలో లక్షకు పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించనుందని పేర్కొంది. మణిపాల్ గ్లోబల్ స్కిల్స్ అకాడమీ ద్వారా విక్రయాలు, కస్టమర్ మేనేజ్మెంట్ బందాలను బలోపేతం చేయడానికి చూస్తున్న భాగస్వామి బిఎఫ్ఎస్ఐ, ఫార్మాస్యూటికల్, కన్స్యూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్ కంపెనీల కోసం ధవీకరించబడిన నిపుణులను నియమించుకుంటున్నట్లు పేర్కొంది. ఎక్సలెన్సీ, అడ్వాన్సుడ్ లాంటి రెండు ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ మాడ్యూల్లను కలిగి ఉన్నట్లు తెలిపింది. ''''నేషనల్ సేల్స్ అకాడమీ ద్వారా క్యాపిటల్ మార్కెట్లు, ట్రేడింగ్, సెక్యూరిటీలు, ఇండియన్ మాస్ మార్కెట్లోని సంపద సష్టిలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల మద్దతు ఇవ్వాలని మేము చూస్తున్నాము.'' అని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రాబిన్ భౌమిక్ పేర్కొన్నారు.