Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడు పాల ఉత్పత్తిదారుల ధర్నా
చెన్నై : పశుగ్రాసం ధరలు విపరీతంగా పెరుగుతున్నందున పాల సేకరణ ధరలు పెంచాలని తమిళనాడు పాల ఉత్పత్తిదారుల సమాఖ్య డిమాండ్ చేసింది. గతేడాది నవంబరులో ప్రభుత్వ పాల సహకార సంఘం ఆవిన్ రైతుల నుండి సేకరించే పాలు ధరను లీటరుకు రూ.3 పెంచింది. ఆవుపాల ధరను రూ.35గా, గేదెపాలు ధరను రూ.44గా నిర్ధారించింది. రూ.10పెంచాలని పాల ఉత్పత్తిదారుల సమాఖ్య డిమాండ్ చేస్తోంది. పశువులకు వేసే గ్రాసం ధర 2019 నుండి 50శాతం పెరిగింది. ఇతర నిత్యావసరాల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం రూ.3 పెంచడం సరికాదని తమిళనాడు పాల ఉత్పత్తిదారుల సమాఖ్య అధ్యక్షుడు మహ్మద్ అలీ అన్నారు. పొరుగున గల కేరళలో పాల సేకరణ ధర ఆవుపాలకు రూ.42గా వుంది. ఇది తమిళనాడు కంటే రూ.7 ఎక్కువ అని అన్నారు. పాల ధరను పెంచాలని డిమాండ్ చేస్తూ చెన్నైలోని అవిన్ ప్రధాన కార్యాలయం వద్ద తమిళనాడు పాల ఉత్పత్తిదారులు ధర్నా నిర్వహించారు. తక్షణమే ప్రభుత్వం సేకరణ ధరను పెంచి, సవరించిన ధరను ప్రకటించాలని కోరారు. పాలల్లో కొవ్వు శాతం తగ్గిందనే పేరుతో సేకరణ ధర రూ.2 లేదా రూ.3 తగ్గిస్తున్నారని అవిన్ ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ తెలిపారు.