Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రయివేటు రంగంలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2022-23 ఆర్థిక సంవ త్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 18.50 శాతం వృద్థితో రూ. 12,259 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.10,342.20 కోట్ల లాభాలు నమోదు చేసింది. క్రితం క్యూ3లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) రూ.22.987 కోట్లకు చేరడంతో మెరుగైన ఆర్థిక ఫలితాలను సాధించగలిగింది. 2021-22 ఇదే క్యూ3లో రూ.18,443 కోట్ల ఎన్ఐఐ నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.26,627 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. క్రితం క్యూ3లో 18.3 శాతం పెరిగి రూ.31,487.7 కోట్లకు చేరింది. 2022 డిసెంబర్ ముగింపు నాటికి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు యథాతథంగా 1.23 శాతంగా నమోదయ్యాయి. నికర నిరర్థక ఆస్తులు 0.33 శాతంగా చోటు చేసుకున్నాయి. గడిచిన డిసెంబర్ త్రైమాసికంలో మొండి బాకీల కోసం రూ.2,806.4 కోట్ల కేటాయింపులు చేసింది. 2022 డిసెంబర్ 31 నాటికి బ్యాంక్ మొత్తం రుణాలు రూ.15.07 లక్షల కోట్లుగా, రూ.17.33 లక్షల కోట్ల డిపాజిట్లు నమోదయ్యాయి.