Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటికి విలువ లేదు : ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్
ముంబయి : క్రిప్టో కరెన్సీ అంటేనే బూటకం, జూదం లాంటిదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆ కరెన్సీకి ఎలాంటి విలువ లేదని స్పష్టం చేశారు. అయితే.. వాటికి విలువ ఉన్నట్లుగా నమ్మిస్తున్నారన్నారు. శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడుతూ.. ''ఏ ఆస్తికైనా, ఆర్థిక ఉత్పత్తికైనా అంతర్గత విలువ అనేది ఒకటి ఉండాలి. కానీ.. క్రిప్టోల విషయంలో అలాంటి విలువ ఏదీ లేదు. వీటి విలువ అంతా అభూత కల్పనే.. మన దేశంలో జూదం అడటానికి అనుమతి లేదు.. జూదాన్ని అనుమతించాల నుకుంటే క్రిప్టోలను జూదంగా పరిగణించాల్సి వస్తుంది. ఈ జూదాన్ని అనుమతించబోం. అలాంటి వాటి విస్తరణను నిషేధించాల్సిన అవసరం ఉంది. వాటి అనియంత్రిత వృద్థికి అనుమతించినట్లయితే కేంద్ర బ్యాంకు అధికారాన్ని కూడా బలహీనం చేస్తుంది. అలాంటి క్రిప్టో కరెన్సీలను దేశంలో నిషేధించాల్సిందే.'' అని దాస్ పేర్కొన్నారు.
''క్రిప్టో కరెన్సీల వృద్థిని ఎదుర్కొనేందుకు ఇటీవల ఆర్బిఐ ఇ-రూపాయి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సిబిడిసి)ని పైలట్ పద్దతిలో ఆవిష్కరించింది. ఈ సిబిడిసి అనేది డబ్బు భవిష్యత్ అని, దానిని స్వీకరించడం రవాణ, ముద్రణ వ్యయాలను ఆదా చేయడంలో సాయపడుతుంది. మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా విధానాలు మార్చుకుంటూ బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి క్రిప్టో అప్లికేషన్ల కారణంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని కొంత మంది వాదిస్తున్న నేపథ్యంలో అలాంటప్పుడు ఆస్థికి అంతర్లీన విలువ ఉండాలి.. కానీ క్రిప్టోకు అంతర్లీన విలువ లేదు. క్రిప్టోలతో దేశ ఆర్థికవ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉంది.'' అని దాస్ పేర్కొన్నారు.