Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి తన వాహన ధరలను పెంచినట్లు ప్రకటించింది. దాదాపు అన్ని మోడళ్ల కార్లపై సగటు పెరుగుదల 1.1 శాతంగా ఉంటుందని తెలిపింది. ధరలను పెంచనున్నట్లు 2022 డిసెంబర్లోనే ఆ కంపెనీ తెలిపింది. కొత్త ధరలు జనవరి 16 నుంచి అమల్లోకి వచ్చాయని పేర్కొంది. కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అన్నో మోడళ్ల కార్లను ఆధునీకరించడం, ఉత్పత్తి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.