Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సోషల్ మీడియా వేదిక షేర్‌చాట్‌లో షేర్‌చాట్ 500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. ఇది ఆ సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో 20 శాతానికి సమానం. వ్యయాలు పెరిగిపోవడం, మూలధనం లభ్యత కొరవడటంతో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఆ కంపెనీ తెలిపింది. షేర్చాట్తో పాటు తన షార్ట్ వీడియో యాప్ మోజ్లోనూ తాజా లేఆఫ్స్ లో భాగంగా 500 మందిని తొలగించనున్నట్టు సమాచారం. సంక్లిష్ట పరి స్ధితులు ఎదురైన క్రమంలో ఉద్యోగుల తొలగింపుపై ఆచితూచి నిర్ణయం తీసుకున్నామని షేర్‌చాట్ ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రకటనల రాబడి తగ్గడంతో పాటు లైవ్ స్ట్రీమింగ్ రెవెన్యూలూ పడిపోవడంతో రాబోయే రెండేండ్లు ప్రతికూల పరిస్ధితులను ఎదురీదాల్సిఉందని, ఉద్యోగుల వ్యయాల్లో కోత వేయడం ద్వారా కంపెనీ ఈ ఇబ్బందులను అధిగమిస్తుందని భావిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.