Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గడిచిన ఏడాది 2022 డిసెంబర్లో భారత ఎగుమతులు 12.2 శాతం పతనమై 34.48 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్థిక అనిశ్చిత్తితో భారత సరుకులకు డిమాండ్ తగ్గుతోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2021 ఇదే డిసెంబర్లో 39.27 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 60.33 బిలియన్ డాలర్లుగా ఉన్న దిగుమతులు.. 2022 డిసెంబర్లో 58.24 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ కాలంలో భారత స్థూల ఎగుమతులు 9 శాతం పెరిగి 332.76 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో దిగుమతులు 24.96 శాతం పెరిగి 551.7 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకున్నాయి.