Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : కరోనా మహమ్మారి మనల్నందరినీ ఆర్థికంగా అస్థిరతకు గురి చేసిన తరు వాత, ఆయా వ్యక్తులు తమ జీతభత్యాలకు అదనంగా క్రమం తప్పని ఆదాయాన్ని సమకూర్చుకోవడంపై ఎంత ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. అలాంటి వారు అష్యూర్డ్ ఫైనాన్షియల్ ఇన్ స్ట్రుమెంట్స్ పై కన్నేస్తున్నా రు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఫ్యూచర్ జెనెరాలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 2022 జులైలో ఫ్యూచర్ జెనెరాలీ లాంగ్ టర్మ్ ఇన్ కమ్ ప్లాన్ ను ప్రకటించింది. ఈ ఉత్పాదన అస్యూర్డ్, హామీపూర్వక ఆదాయాన్ని పాలసీ మొదటి సంవత్సరం నుంచే 50 ఏళ్ల దాకా అందిస్తుంది. ఒకవేళ ఎవరైనా 5 ఏళ్ల తరువాతి నుంచి ఆదాయం ప్రారంభం కావాలనుకుంటే, దాంతో వారు మిగిలిన కాలానికి అధిక ఆదాయం కూడా పొందగలుగుతారు. ఈ విలువను మరింత పెంచేలా ఫ్యూచర్ జెనెరాలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ తాజాగా ఫ్యూచర్ జెనెరాలీ లాంగ్ టర్మ్ ఇన్ కమ్ ప్లాన్ రివైజ్డ్ వెర్షన్ ను అధికం చేయబడిన హామీపూర్వక ప్రయోజనాలతో ప్రవేశపెట్టింది. ఫ్యూచర్ జెనరలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ శ్రీ బ్రూస్ డి బ్రో యిజ్ ఫ్యూచర్ జెనరాలి లాంగ్ టర్మ్ ఇన్కమ్ ప్లాన్ తాజా వెర్షన్ ఆవిష్కరణను ప్రకటిస్తూ, ‘‘జీవన వ్యయం నిరంతరం పెరుగుతుండడాన్ని మేం గమనిస్తున్నాం, ఇది హామీపూర్వక అధిక ఆదాయాన్ని ఆకర్షణీయమైన ఆఫర్‌గా చేస్తుంది. ఇది తమ పొదుపుపై హామీతో కూడిన రాబడిని కోరుకునే వారి కోసం ఉద్దేశించింది. మా లాంగ్ టర్మ్ ఇన్కమ్ ప్లాన్ ప్రోడక్ట్ తాజా వెర్షన్ అంతిమంగా అధిక హామీపూర్వక ఆదా యాన్ని, అధిక రాబడిని కస్టమర్‌కు అందిస్తుంది. క్రమవ్యవధిలో రెండో ఆదాయానికి హామీ ఇవ్వడం ద్వా రా సమీప భవిష్యత్తులో తలెత్తే ఏవైనా ఆర్థిక అస్థిరతల నుండి సురక్షితంగా ఉండటానికి ఈ ప్లాన్ సహాయ పడుతుంది. ఈ ప్రణాళిక తమ భవిష్యత్తు కోసం ముందస్తు ఆర్థిక ప్రణాళికను ప్రారంభించాలనుకునే యువ తరానికి కూడా సహాయపడుతుంది. ఈ తరం చిన్న మొత్తాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా టర్మ్ అంతటా హామీ ప్రయోజనాలను పొందడం ద్వారా ప్రారంభించవచ్చు’’ అని అన్నారు.
ఫ్యూచర్ జెనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ విస్తృతమైన జీవిత బీమా ఉత్పత్తులను, పంపిణీ నెట్వర్క్ ను అందిస్తుంది, ఇది మేం మా కస్టమర్ల అవసరాలకు దగ్గరగా ఉన్నామని నిర్ధారిస్తుం ది.
ఫ్యూచర్ జెనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ ఫోలియో అన్ని వర్గాల కస్టమర్లకు వారి జీవిత దశలలో సేవలందించే పరిశ్రమ ప్రముఖ ఉత్పత్తులను అందిస్తుంది. ఇప్పుడు ఈ ప్లాన్‌తో, ఎలాంటి ఆందోళన లేకుండా జీవితంలోని అన్ని మైలురాళ్లను ఆనందించవచ్చు.