Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ఆన్ రీఇన్ఫోర్డ్స్ ప్లాస్టిక్ (ఐసీఈఆర్పీ)-2023 సదస్సు జనవరి 18న ప్రారంభం కానుంది. ముంబయిలో జరగనున్న ఈ కాన్ఫరెన్స్ జనవరి 20న ముగియనుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సులో ఇండియన్ కాంపోజిట్ పరిశ్రమ వాటాదారులంతా ఒకే వేదిక పైకి వస్తారన్నారు. 2027 నాటికి భారత కాంపోజిట్ పరిశ్రమ 2.01 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.16వేల కోట్లు)లకు చేరనుందని అంచనా. రాబోయే ఐదేళ్లలో అంతర్జాతీయ సరాసరి వద్ధిని అధిగమించనుందని ఆ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.