Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ కంపెనీ మార్సెల్లస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వినూత్నమైన క్వాంట్ ఆధారిత ఫండ్ మార్సెల్లస్ మెరిటార్క్యును విడుదల చేసినట్లు ప్రకటించింది. దీన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు రిస్క్ సర్దుబాటు చేసిన రాబడులను అందించేలా రూపకల్పన చేసినట్లు పేర్కొంది. కనీస పెట్టుబడి రూ.10 లక్షలుగా నిర్ణయించింది. దీనిలో పెద్ద, మధ్య, చిన్న తరహా 35-45 స్టాక్స్ ఉంటాయని.. ఈ ఫండ్‌ను నిఫ్టీ 500 టీఆర్‌ఐకు బెంచ్‌మార్క్ చేసినట్లు పేర్కొంది. తక్కువ ప్రతికూల రిస్క్‌తో అత్యుత్తమ రాబడిని అందించడానికి ఈ ఫండ్ దోహదం చేస్తుందని తెలిపింది.