Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కొత్త ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ రోజు దాదాపుగా 1600 చొప్పున టెక్నలాజీ ఉద్యోగాలు ఊడాయని ఆన్లైన్ వేదిక లేఆఫ్స్.ఎఫ్వైఐ ఓ రిపోర్టులో వెల్లడించింది. భారత్ సహా అన్ని దేశాల్లో తొలి 15 రోజుల్లో 91 టెక్ కంపెనీలు దాదాపు 24.000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయని తెలిపింది. 2022లో 1000 కంపెనీలు తొలగించిన 1.5 లక్షల సిబ్బందితో పోల్చితే.. కొత్త ఏడాదిలో పరిస్థితి తీవ్రంగా ఉందని విశ్లేషించింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత్తి, మాంద్యం వల్ల అన్ని దేశాల్లోను కోతలు నమోదయ్యాయని పేర్కొంది. మెటా, అమెజాన్, ట్విట్టర్, బెట్టర్.కమ్, అలీబాబా ఉద్యోగుల ఉద్వాసనలు పలికిన వాటిలో ఉన్నాయని తెలిపింది.