Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 93% భారత సీఈఓల వెల్లడి
న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల్లో నెలకొన్న అనిశ్చిత్తి నేపథ్యంలో తమ కంపెనీల వ్యయాల తగ్గింపునపై దృష్టి పెట్టినట్లు 93 శాతం మంది భారత కంపెనీల సీఈఓలు అభిప్రాయ పడ్డారు. తాము నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలని యోచిస్తున్నామని కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ నిర్వహించిన వార్షిక గ్లోబల్ సీఈఓ సర్వేలో తెలిపారు. ప్రతీ పది మంది సీఈఓ లలో నలుగురు తమ కంపెనీలు ప్రస్తుత మార్గంలో కొనసాగితే 10 సంవత్సరాలలో ఆర్థికంగా లాభదాయకంగా ఉంటాయని ఆశించడం లేదని అభిప్రాయపడ్డారు. వచ్చే 12 నెలల్లో ప్రపంచ ఆర్థిక వద్ధి క్షీణిస్తుందని దాదాపు 78 శాతం మంది భారత సిఇఒలు, 73 శాతం ప్రపంచ సీఈఓ లు, 69 శాతం ఆసియా పసిఫిక్ కంపెనీల సీఈఓ లు అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాల భవిష్యత్తు వృద్థిపై సందిగ్దత నెలకొన్నప్పటికీ భారత వృద్థి బాగానే ఉండొచ్చని 57 శాతం మంది ఆశాభావం వ్యక్తం చేశారు.