Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : భారత్‌లోని పెద్ద నగరాల్లో పెరుగుతున్న ఇండ్ల ధరలు, అధిక అద్దెల వల్ల ద్రవ్యోల్బణ ముప్పు పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వినియోగదారుల ద్రవ్యోల్బణ సూచీ (సీపీఐ) పెరుగుదల గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో హెచ్చు అద్దెలు ఆర్బీఐకి కొత్త సవాల్‌గా మారనున్నాయని హెచ్చరిస్తున్నారు. గృహ అద్దెలు, దాని అనుబంధ ఖర్చులు మొత్తం ద్రవ్యోల్బణంలో 10.07 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ ద్రవ్యోల్బణం మూడు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరువలో ఉంది. గత రెండేండ్లుగా పెరిగిన ఆహార ధరలతో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో గృహ అద్దెలు మరింత ఒత్తిడిని పెంచుతున్నాయని.. దీన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని ఆర్బీఐ వ్యవహారాలు తెలిసిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. పట్టణ హౌసింగ్ ద్రవ్యోల్బణం డిసెంబర్ 2022లో సంవత్సరానికి 4.47 శాతానికి పెరిగింది. ఇంతక్రితం ఏడాది ఇది 3.61 శాతంగా, 2020లో 3.21 శాతంగా నమోదయ్యాయి. ''ప్రధాన ద్రవ్యోల్బణం స్థిరంగా కొనసాగుతోంది. కానీ.. గహ ద్రవ్యోల్బణం పెరుగుదల మొత్తం ద్రవ్యోల్బణ దక్పథానికి హెచ్చు ప్రమాదాన్ని కలిగిస్తుంది'' అని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థికవేత్త అదితి గుప్తా పేర్కొన్నారు.