Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నికర లాభాలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్ లాభాలు 139 శాతం పెరిగి రూ.775 కోట్లకు చేరాయి. ముఖ్యంగా నికర వడ్డీ ఆదాయం, మొండి బాకీల కేటాయింపులు తగ్గడం బ్యాంక్ ఆకర్షణీయ ఫలితాలకు కారణమని పేర్కొంది. పూణె కేంద్రంగా పని చేస్తున్న ఈ బ్యాంక్ 2021-22 క్యూ3లో రూ.325 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన క్యూ3లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 30 శాతం పెరిగి రూ.1,980 కోట్లుగా నమోదయ్యింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,527 కోట్ల ఎన్ఐఐ చోటు చేసుకుంది.