Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
భారతదేశం 2022లో పెట్టుబడి పెట్టు బడిన తీరు, 2023లో జనరంజకంగా ఉండనున్న పెట్టుబడి ధోరణులను చర్చించేలా పెట్టుబడి టెక్నాలజీ వేదిక అయిన వెల్త్ డెస్క్ వార్షిక బులెటిన్ ను విడుదల చేసింది. 2023లో అంచనాల గురించి వెల్త్ డెస్క్ ఫౌండర్ అండ్ సీఈఓ ఉజ్వల్ జైన్ మాట్లాడుతూ... పెట్టుబడిదారుల ప్రయోజనాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని, క్యాపిటల్ మార్కెట్లలో నవ్యావిష్కరణకు వీలు కల్పించడం. కోసం సెక్యూరిటీస్ మార్కెట్ రెగ్యులేటర్ ఎస్ ఈబీఐ ఒక గొప్ప ఇన్ క్యుబేషన్ స్థానాన్ని రూపొందించిందన్నారు. ఇది ఈక్విటీలలో తమ పెట్టుబడి యాత్రను ప్రారంభించడానికి మొదటి తరం పెట్టుబడిదారుల్లో చాలా మందిలో నమ్మకం కలిగించి, శక్తి నింపిందన్నారు. వచ్చే రెండేళ్లలో మరింత ఎక్కువ మంది రిటైల్ పెట్టు బడిదారులు పాలుపంచుకుంటారని తాను ఘంటాపథంగా చెప్పగలనన్నారు. అంతేకాక, బలమైన స్థూల ఆర్థిక వాతావరణం కారణంగా భారతదేశం అనేక అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కన్నా మెరుగైన వేగంతో వృద్ధి చెందనుందన్నారు. అయినా ఎప్పటికప్పుడు నిర్ధిష్ట రంగాల్లో అవకాశాలు లభిస్తున్నందున, పెట్టు బడిదారులు దానికి తగ్గట్టు తమ స్టాక్ పందేలను సరి చేసుకోవడం కోసం వెల్త్ బాస్కెట్ క్యూరేటర్లలో పెట్టుబడి పెట్టే అంశాన్ని పరిశీలించవచ్చన్నారు.