Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
- 2022లో భారతదేశంలో జరిగిన పెట్టుబడుల ఒరవడిపై స్నాప్ షాట్ అందించిన బులెటిన్ది
ప్రధానాంశాలు:
● డిజిటల్ ఇండియా థీమ్ రీటైల్ పెట్టుబడిదారులకు ఒక విశిష్ఠమైన పెట్టుబడి తయారీ అవకాశంగా అవతరించింది.
● ITC లిమిటెడ్., ICICI బ్యాంక్, కోల్ ఇండియా, సన్ ఫార్మా మరియు SBIలు 2022లో WealthDesk క్యూరేటర్లలో అత్యంత జనరంజకమైనవిగా నిలిచాయి.
● సంపూర్ణ రిటర్న్ అయిన 13.21%తో Alpha Bluechip అత్యంత ట్రెండింగ్ లో ఉన్న WealthDesk గా అవతరించింది.
● WealthDesk క్యూరేటర్లు 2023 కోసం PSU బ్యాంకులు, లోహం, రక్షణ, FMCG రంగాలపై పందెం కాస్తున్నారు.
బెంగళూరు,2023: భారతదేశం 2022లో పెట్టుబడి పెట్టుబడిన తీరు, 2023లో జనరంజకంగా ఉండనున్న పెట్టుబడి ధోరణులను చర్చించేలా పెట్టుబడి టెక్నాలజీ వేదిక అయిన WealthDesk నేడు WealthDesk వార్షిక బులెటిన్ ను విడుదల చేసింది. 2022లో ప్రపంచ సూచీలను ముందుకు నడిపించిన అంశాలు, కీలక రంగాల పనితీరు, 2022లో రీటైల్ మదుపుదారులను ఆకట్టుకున్న చక్కటి పనితీరు కలిగిన వెల్త్ బాస్కెట్లను చర్చించింది. అలాగే 2023లో వెల్త్ బాస్కెట్ క్యూరేటర్లు పందెం కాచే పెట్టుబడి ఐడియాలలోకి కూడా తొంగిచూసింది.
డిజిటల్ ఇండియా థీమ్ లోకి లోతైన వీక్షణను అందించడం ద్వారా ఈ బులెటిన్ 2017నుండి మన దేశం డిజిటల్ హితపూర్వకం పరంగా సాగిస్తున్న గణనీయ పురోగతిని ఎత్తి చూపింది. 2025 ఆర్థిక సంవత్సరం నాటికల్లా డిజిటల్ ఎకానమీ వాటాను జిడిపిలో 20%కు పెంచాలని ఆశిస్తోంది. 2025 - 26 నాటికి పరంగా ట్రిలియన్ కు భారత దేశం చేరువ కానుండగా, జిడిపిలో trillion డిజిటల్ ఎకానమీ నుండి రావాలని ప్రభుత్వం, వ్యాపార సంస్థలు గట్టి అంచనాలతో ఉన్నాయి. దీనిని సాధిస్తే, పెట్టుబడిదారులు పరిశీలించాల్సిన అనేక సంపద తయారీ మార్గాలకు దారులు తెరుచుకోవడం గణనీయంగా పెరగవచ్చు.
ఈ వార్షిక బులెటిన్ ప్రకారం, ITC లిమిటెడ్, ICICI బ్యాంక్, కోల్ ఇండియా, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల స్టాక్ లు వెల్త్ బాస్కెట్ క్యూరేటర్ల మధ్య చాలా బాగా ప్రాచుర్యం పొందాయి. 19 వెల్త్ బాస్కెట్లలో చోటు చేసుకున్న ITC లిమిటెడ్ అతి గొప్ప వెల్త్ బాస్కెట్ కౌంట్ గా నిలవగా, 12 వెల్త్ బాస్కెట్లతో ICICI బ్యాంక్ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. 11 వెల్త్ బాస్కెట్లతో కోల్ ఇండియా మూడో స్థానంలోనూ,. 10 వెల్త్ బాస్కెట్లతో సన్ ఫార్మా, SBIలు క్రమంగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇంతే కాకుండా, 13.21% సంపూర్ణ రిటర్న్ తో Alpha Bluechip 2022లో బాగా ట్రెండింగ్ లో ఉన్న వెల్త్ బాస్కెట్ గా అవతరించగా, 16.4% సంపూర్ణ రిటర్న్ తో Gulaq Gear 6 అత్యుత్తమ వెల్త్ బాస్కెట్ గా నిలిచింది.
2023లో అంచనాల గురించి WealthDesk ఫౌండర్ & CEO ఉజ్వల్ జైన్ మాట్లాడుతూ, “పెట్టుబడిదారుల ప్రయోజనాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని, క్యాపిటల్ మార్కెట్లలో నవ్యావిష్కరణకు వీలు కల్పించడం కోసం సెక్యూరిటీస్ మార్కెట్ రెగ్యులేటర్ SEBI ఒక గొప్ప ఇన్ క్యుబేషన్ స్థానాన్ని రూపొందించింది. ఇది ఈక్విటీలలో తమ పెట్టుబడి యాత్రను ప్రారంభించడానికి మొదటి తరం పెట్టుబడిదారుల్లో చాలా మందిలో నమ్మకం కలిగించి, శక్తి నింపింది. వచ్చే రెండేళ్లలో మరింత ఎక్కువ మంది రిటైల్ పెట్టుబడిదారులు పాలుపంచుకుంటారని నేను ఘంటాపథంగా చెప్పగలను.” అని అన్నారు. అంతేకాక, “బలమైన స్థూల ఆర్థిక వాతావరణం కారణంగా భారతదేశం అనేక అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కన్నా మెరుగైన వేగంతో వృద్ధి చెందనుంది. అయినప్పటికీ, ఎప్పటికప్పుడు నిర్ధిష్ఠ రంగాల్లో అవకాశాలు లభిస్తున్నందున, పెట్టుబడిదారులు దానికి తగ్గట్టు తమ స్టాక్ పందేలను సరి చేసుకోవడం కోసం వెల్త్ బాస్కెట్ క్యూరేటర్లలో పెట్టుబడి పెట్టే అంశాన్ని పరిశీలించవచ్చు.” అని అన్నారు.
2023 కోసం వెల్త్ బాస్కెట్ క్యూరేటర్లు పంచుకున్న పెట్టుబడి ఐడియాలు:
● వెల్త్ బాస్కెట్ క్యూరేటర్ & Rupeeting ఫౌండర్ సాగర్ లేలే, - విధాన కోణంలో చూస్తే, ప్రభుత్వానికి సంబంధించిన చర్యలతో ముడిపడిన ఏదైనా మంచి పెట్టుబడే కాగలదు. అది మౌలిక వసతుల రంగం, కావచ్చు, ప్రభుత్వ రంగ బ్యాంకులు కావచ్చు, సిమెంట్ లేదా రక్షణ రంగం కావచ్చు.
● వెల్త్ బాస్కెట్ క్యూరేటర్ & AlfAccurate Advisors ఫౌండర్ రాజేశ్ కొథారి - బ్యాకింగ్ & ఫైనాన్స్, కేపెక్స్, కన్సూమరిజం, చైనా+1 విధానం
● వెల్త్ బాస్కెట్ క్యూరేటర్ & Xumit Capital ఎండి సుమిత్ సింగ్- బ్యాంకింగ్, FMCG, నిర్మాణ రంగం సామగ్రి, క్యాపిటల్ గూడ్స్ 2023లో చక్కటి పనితీరును కనబరుస్తాయి.
2023 కోసం పెట్టుబడి ఐడియాలను అందించడం మాత్రమే కాకుండా, వెల్త్ బులెటిన్ వాల్యూ ఇన్వెస్టింగ్ vs వాల్యూ ఫ్యాక్టర్, పరిమాణాత్మక విధానం యొక్క ప్రాముఖ్యత, ESG పెట్టుబడులు లాంటి అత్యంత ప్రాముఖ్యమైన శీర్షికలపై కూడా వెల్త్ బాస్కెట్ క్యురేటర్ల లోతైన అభిప్రాయాలను తెలుసుకుంది.
వెల్త్ డెస్క్ పరిచయం:
- 2016లో స్థాపించిన వెల్త్ డెస్క్ బ్రోకింగ్ ను దాటి అసెట్ అండ్ వెల్త్ మేనేజ్ మెంట్ కోసం ఏకీకృత వెల్త్ ఇంటర్ ఫేస్ (UWI)ను నిర్మించే ఇంటర్నెట్ స్కేల్ ఇన్వెస్ట్ మెంట్ టెక్నాలజీ వేదిక. వెల్త్ డెస్క్ వేదిక సమర్పిస్తున్న UWIను ఎంబెడెడ్ వెల్త్ డెస్క్ గేట్ వే(EWG)ను ఆధారంగా చేసుకుని, నిర్మించబడింది. EWG రీటైల్ పెట్టుబడిదారులకు తమ బ్రోకింగ్ ఖాతాలు ద్వారా మొబైల్ యాప్ లు, వెబ్ సైట్లులో సాఫీగా పెట్టుబడులు పెట్టేందుకు వీలు కల్పిస్తుంది. వెల్త్ డెస్క్ ఈక్వీటీలు, ETFలు, ఇతర అసెట్ వర్గాలను దాటి సంపూర్ణ పెట్టుబడి/అసెట్ నిర్వహణ/అడ్వైజరీ వాల్యూ చెయిన్ వీటిని వెల్త్ బాస్కెట్లు అని పిలిచే పెట్టుబడి ఉత్పత్తులుగా తయారు చేసి, ఆ తర్వాత బలమైన నెట్ వర్క్ ప్రభావం కలిగిన SEBI రిజిస్టర్డ్ బ్రోకింగ్ భాగస్వాముల ద్వారా భారీ స్థాయి పంపిణీకి వీలు కల్పిస్తుంది.
సంప్రదించండి: pr@wealthdesk.in