Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనరల్ అట్లాంటిక్ సహకారం
- ఏకీకృత పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) కోసం తదుపరి దశ వృద్ధికి, భారతీయులకు భారీ స్థాయిలో డిజిటల్ ఫైనాన్స్ సేవలు అందించడానికి ఈ నిధులు వీలు కల్పించవచ్చని అంచనా
- PhonePe ఇటీవల Flipkart నుండి వేరు పడడం, భారతదేశానికి తన నివాస స్థానాన్ని మార్చుకున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది
నవతెలంగాణ బెంగుళూరు: బెంగుళూరు, ఇండియా,న్యూయార్క్, NY –2023 – బిలియన్ల ముందస్తు అంచనా విలువతో ప్రముఖ ప్రపంచ గ్రోత్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ నుండి 0 మిలియన్ల నిధులను సేకరించామని భారతదేశంలోని అతిపెద్ద ఫిన్ టెక్ వేదికలలో ఒకటైన PhonePe నేడు ప్రకటించింది. జనవరి 2023లో బిలియన్ డాలర్ల వరకు నిధుల సేకరణ కోసం PhonePe ప్రారంభించిన కార్యక్రమానికి ది జనరల్ అట్లాంటింక్ పెట్టుబడులు తొలివిడతను సూచిస్తున్నాయి. వచ్చే నెలతో ముగుస్తుందని భావిస్తున్న రెండో విడత కోసం పలు కొత్త ప్రపంచ, భారతీయ పెట్టుబడి సంస్థలు ఇప్పటికే సంతకాలు చేశాయి. PhonePe ఇటీవల Flipkart నుండి వేరు పడడం, భారతదేశానికి తన నివాస స్థానాన్ని మార్చుకున్న నేపథ్యంలో ఈ నిధుల సేకరణ జరుగుతుండడం గమనార్హం.
డేటా సెంటర్ల అభివృద్ధి, దేశంలో భారీ స్థాయిలో ఆర్థిక సేవలను అందించడంలో సహాయపడడం సహా మౌలిక వసతుల రంగాల్లో గణనీయమైన పెట్టుబడులను పెట్టాలని PhonePe ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇన్సూరెన్స్ రంగం, సంపద నిర్వహణ, రుణాలు ఇవ్వడం లాంటి కొత్త వ్యాపార మార్గాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా కంపెనీ సన్నాహాలు చేసుకుంటోంది. భారతీయులను గొప్ప స్థాయిలో ఆర్థిక సేవల రంగంలో కలుపుకోవడానికి వీలుగా UPI లైట్ మరియు UPIపై రుణం సహా భారతదేశంలో UPI పేమెంట్ల తదుపరి దశ వృద్ధిని వేగవంతం చేయాలని కోరుకుంటున్నందున PhonePeకు ఈ నిధుల సేకరణ సహకరిస్తుందని భావిస్తున్నారు. డిసెంబర్ 2015లో స్థాపించబడిన PhonePe భారతదేశంలో దినదినాభివృద్ధి చెందుతున్న డిజిటల్ వాతావరణ వ్యవస్థ వల్ల లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, విస్తరించడం ద్వారా స్వదేశంలో వృద్ధి చెందిన విజయగాథగా నిలుస్తోంది. భారతీయ మార్కెట్లకు అనువుగా రూపొందించిన ఉత్పత్తులు, ఆఫరింగ్ లతో PhonePe నేడు 400 మిలియన్లకు పైగా రిజిస్టర్డ్ వినియోగదారులను కలిగి ఉంది. అంటే నాలుగోవంతు భారతీయులు PhonePeను వినియోగిస్తున్నారు. అంతేకాక, దేశంలోని 99% పిన్ కోడ్లలో వ్యాపించిన 2, 3, 4 శ్రేణి, అంతకన్నా చిన్న నగరాల్లో ఉన్న 35 మిలియన్లకు పైగా ఆఫ్ లైన్ మర్చంట్లను కూడా కంపెనీ విజయవంతంగా డిజిటల్ మయం చేసింది. తురియు కొత్త పెట్టుబడిదారులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. భారతదేశంలో ప్రస్తుతం సాగుతున్న దేశ వ్యాప్త డిజిటలీకరణ ప్రయత్నాలకు సహాయం అందించడాన్ని PhonePe గర్వంగా భావిస్తోంది. ఈ శక్తివంతమైన ప్రభుత్వ-ప్రైవేట్ సమ్మేళనం భారతీయ డిజిటల్ వాతావరణ వ్యవస్థను ప్రపంచానికే ఆదర్శంగా నిలిచేలా చేసింది. మాది భారతీయుల ద్వారా నిర్మించబడిన భారతీయ కంపెనీ. మా తాజా నిధుల సేకరణ అందరినీ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలన్న భారతీయ ప్రభుత్వ విజన్ ను వేగవంతం చేయడంలో ఇది మాకు సహాయపడుతుంది. ” అని అన్నారు. “అంతేకాక ఇన్సూరెన్స్, సంపద నిర్వహణ, రుణాలు ఇవ్వడం లాంటి కొత్త వ్యాపార రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మా వృద్ధిని తదుపరి దశకు తీసుకువెళ్లాలనుకుంటున్నాము. అదే విధంగా భారతదేశంలో UPI పేమెంట్ల తదుపరి దశ వృద్ధికి కూడా సదుపాయాలు కల్పించాలనుకుంటున్నాము’’ అని అన్నారు.
జనరల్ అట్లాంటిక్ మేనేజింగ్ డైరెక్టర్, ఇండియా హెడ్ శంతను రస్తోగి మాట్లాడుతూ, “సమీర్, రాహుల్, PhonePe యాజమాన్య బృందం పేమెంట్ల డిజిటలీకరణను ముందుకు నడపడం కోసం ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ముందుకు తీసుకువెళుతూ, భారత ప్రజలకు ఆర్థిక సాధనాల యాక్సెస్ ను విస్తృతం చేస్తోంది. బహిరంగ API ఆధారిత ‘India stack’లో అభివృద్ధి చేసిన సమ్మిళిత ఉత్పత్తుల స్వీకరణను ముందుకు తీసుకు వెళ్లడంపై వారు నిలకడగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈ విజన్ జనరల్ అట్లాంటిక్ యొక్క దీర్ఘకాలిక దృఢసంకల్పమైన సమ్మిళితం, సాధికారతపై దృష్టి కేంద్రీకరించే అధిక వృద్ధి వ్యాపార సంస్థలకు అండగా నిలవాలనే దానికి అనువుగా ఉంటోంది.” అని అన్నారు. “భారతదేశంలో డిజిటల్ నవ్యావిష్కరణ తదుపరి దశకు వీలు కల్పించడంలో సహాయపడేందుకు PhonePe బృందంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది” అని అన్నారు. PhonePe కూడా ఇటీవల Flipkart గ్రూప్ నుండి పూర్తిగా వేరుపడినట్టు ప్రకటించింది. డిసెంబర్ 2020లో Flipkartనుండి పాక్షికంగా వేరుపడగా, Walmart ఆధ్వర్యంలో Flipkart వాటాదారులు పెద్ద సంఖ్యలో ఇటీవలి విభజనలో వాటాలు చేజిక్కించుకున్నారు. ఈ చర్య తమ సొంత వృద్ధి మార్గాలను రూపొందించుకునేందుకు, స్వతంత్రంగా తమ వ్యాపారాలను నిర్మించుకోవడానికి, రెండు కంపెనీల యొక్క వాటాదారులకు వ్యాపార విలువను గరిష్ఠ స్థాయికి పెంచే అవకాశాలను అన్వేషించేందుకు రెండు కంపెనీలకు వీలు కల్పించాయి.