Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· ఫోక్స్‌వేగన్ తో భద్రతను ఎంచుకోండి : ఆంధ్రప్రదేశ్‌లో మా తాజా మరియు యంగ్ పోర్ట్‌ఫోలియోను మరింత దగ్గరగా తీసుకురండి
· మెరుగైన ప్రాప్యత : విజయవాడలో నూతన3ఎస్ (సేల్స్, స్పేర్స్ మరియు సర్వీసెస్) టచ్‌పాయింట్ ప్రారంభంతో రాష్ట్రంలో మా కార్యకలాపాలు బలోపేతం. ఇక్కడ 8 సేల్స్ మరియు 6 సర్వీస్ టచ్పాయింట్లు ఉన్నాయి
· అత్యున్నత నిర్మాణం మరియు జర్మన్ ఇంజినీర్డ్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో : ఈ షోరూమ్‌లో ఫోక్స్‌వేగన్ టైగున్, వర్టుస్, టిగున్ సహా 8 కార్ల ప్రదర్శన
· విస్తరించబడిన నెట్వర్క్: ఫోక్స్‌వేగన్ బ్రాండ్ ఇప్పుడు 159 సేల్స్ మరియు 126 సర్వీస్ టచ్పాయింట్లు సహా భారతదేశవ్యాప్తంగా 118 నగరాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
నవతెలంగాణ విజయవాడ: ఫోక్స్‌వేగన్ ప్యాసెంజర్ కార్స్ ఇండియా , దక్కన్ ప్రాంతంలో తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తూ నూతన సేల్స్, సర్వీస్ టచ్‌పాయింట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ప్రారంభించింది. శ్రీ రాజేష్ పాములపర్తి నేతృత్వంలోని ఈ నూతన సేల్స్ అండ్ సర్వీస్ టచ్‌పాయింట్ ఎనికేపాడువద్ద ఎన్‌హెచ్5 రోడ్లో ఉంది.
ఫోక్స్‌వేగన్ తో భద్రతను ఎంచుకోండి : నూతన 3ఎస్ (సేల్స్, సర్వీస్, స్పేర్స్) టచ్‌పాయింట్ తాజా మరియు అత్యాధునిక ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను వినియోగదారులకు చేరువ చేయనుంది. భారతదేశంలో అత్యంత సురక్షితమైన ఎస్‌యువీడబ్ల్యుగా ఫోక్స్‌వేగన్ టైగున్ ; అకట్టుకునే మరియు ఉల్లాసకరమైన వర్టుస్ నుంచి అంతర్జాతీయంగా ఫోక్స్‌వేగన్‌కు అత్యధికంగా విక్రయాలు జరిగిన వాహనంగా నిలిచిన టిగున్ వరకూ, అత్యున్నత నిర్మాణం మరియు జర్మన్ ఇంజినీర్డ్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో విజయవాడలో విస్తృతస్ధాయిలో 8 కార్ల డిస్ప్లేను కలిగి ఉంది.
ఫోక్స్‌వేగన్ ప్యాసెంజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ శ్రీ అశీష్ గుప్తా ఈ నూతన సదుపాయం ప్రారంభం గురించి మాట్లాడుతూ ‘‘ శక్తివంతమైన నిర్మాణం, భద్రత మరియు జర్మనీ తయారీ కార్ల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ఆంధ్రప్రదేశ్‌లో మేము చూస్తున్నాము. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ మరియు వ్యాపార లావాదేవీలు పెరుగుతుండటం దీనికి కారణం. అందువల్ల, మేము మా కార్యకలాపాలు విస్తరించడంతో పాటుగా ఈ ప్రాంతంలో మా వినియోగదారుల అవసరాలను సైతం తీర్చనున్నాము. రాష్ట్రంలో 8 సేల్స్ మరియు 6 సర్వీస్ టచ్పాయింట్ల ద్వారా, ప్రపంచశ్రేణి ఉత్పత్తులు మరియు సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నాము. ఇది మా వినియోగదారుల ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఇబ్బందులు లేని అనుభవాలను అందించడానికి కట్టుబడి ఉంది’’ అని అన్నారు.
నూతన డీలర్షిప్ ప్రారంభం గురించి ఫోక్స్‌వేగన్ విజయవాడ డీలర్ పార్టనర్ శ్రీ రాజేష్ పాములపర్తి మాట్లాడుతూ ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఈ నూతన సదుపాయం ప్రారంభించడంతో, ఫోక్స్‌వేగన్‌తో మా అనుబంధం మరింత బలోపేతం చేసుకోవడం సంతోషంగా ఉంది.దీనితో పాటుగా ఈ ప్రాంతంలో జర్మన్ ఇంజినీర్డ్ కార్ల ప్రాప్యతను సైతం వృద్ధి చేస్తున్నాము. ఈ సదుపాయంతో, సురక్షితమైన, ప్రీమియం మొబిలిటీ పరిష్కారాలను ఇంటిగ్రేటెడ్ వినియోగదారుల అనుభవాలతో అందించనున్నాము’’ అని అన్నారు.
ఫోక్స్‌వేగన్ విజయవాడ, బ్రాండ్ యొక్క నూతన బ్రాండ్ డిజైన్ అంశాలను కలిగి ఉంది. ఇది ఈ టచ్‌పాయింట్‌ను మరింతగా అందుబాటులో ఉంచడంతో పాటుగా ప్రస్తుత, సంభావ్య వినియోగదారులకు సౌకర్యవంతమైన అనుభవాలకు భరోసా అందిస్తుంది. ఈ స్టోర్‌లోని 90 మంది ఉద్యోగులు వినియోగదారుల మొబిలిటీ మరియు సేవా అవసరాలను తీర్చగలరు. దీనిలో పెద్దవైన 24 బేస్ సదుపాయం ఉంది. ఈ సర్వీస్ టచ్‌పాయింట్ మా వినియోగదారుల సేవలు, నిర్వహణ మరియు యాక్సిడెంట్ రిపేర్ అవసరాలను తీర్చగలదు. సుశిక్షితులైన, నైపుణ్యవంతులైన టెక్నీషియన్లు దీనిని నిర్వహిస్తారు. సర్వీస్ షాప్కుదూరంగా ఉన్న వినియోగదారులు డోర్ టు డోర్ సేవల కార్యక్రమం– ఫోక్స్‌వేగన్ అసిస్టెన్స్ మరియు మొబైల్ సర్వీస్ యూనిట్ సైతం పొందగలరు. నేడు , ఫోక్స్‌వేగన్ అత్యంత శక్తివంతంగా 159 సేల్స్ మరియు 126 సర్వీస్ టచ్ పాయింట్లతో భారతదేశ వ్యాప్తంగా 118 నగరాలలో ఉంది. మరిన్ని వివరాల కోసం వినియోగదారులు తమ దగ్గరలోని షోరూమ్ సందర్శించడం లేదా ఫోక్స్‌వేగన్ ఇండియా వెబ్సైట్ సందర్శించడం చేయవచ్చు.