Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్)లో భాగంగా జెకెఎంఆర్ ఫౌండేషన్‌కు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సాయం అందించింది. చేవెళ్ల ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో శుభ్రత లేని మూత్రశాలల వల్ల చాలా మంది పిల్లలు స్కూళ్ల నుంచి డ్రాపవుట్లుగా మారుతున్నారు. అలాంటి పాఠశాలల్లో టాయిలెట్లను శుభ్రంగా ఉంచడా నికి జెకెఎంఆర్ ఫౌండేషన్‌కు సిఎస్ఆర్ కింద మొబైల్ క్లీనింగ్ ట్రక్క్‌లను అందించింది. వీటిలో నీటి ట్యాంక్, ప్రెజర్ పంప్ ఇతర పరికరాలు ఉంటాయి. ఇలాంటి రెండు మినీ మొబైల్ క్లీనింగ్ ట్రక్క్‌లను జెకెఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులకు పిఎన్‌బి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కల్యాణ్ కుమార్, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు మక్స్ద్ అలీ, ఎన్విఎస్పి రెడ్డి అందజేశారు.