Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జెట్ ఫ్రైట్ లాజిస్టిక్ లిమిటెడ్ రూ.37.70 కోట్ల రైట్స్ ఇష్యూ శుక్రవారం ప్రారంభిం చింది. త్వరగా పాడయ్యే లక్షణాలున్న సరుకు రవాణలో విశిష్టత కలిగిన ఈ సంస్థ విస్తరణ ప్రణాళికల కోసం నిధులను సమీకరించాలని నిర్ణయించింది. గోదాముల కొనుగోలు, వర్కింగ్ కాపిటల్ తీర్చుకోవడం, కొత్త ప్రాంతాల్లోకి ప్రవేశించడానికి ఈ నిధులను ఉపయోగించనున్నట్లు పేర్కొంది. ఈ రైట్స్ ఇష్యూ జనవరి 31న ముగియనుంది. రూ.5 ముఖ విలువ కలిగిన 2,32,01,892 ఫుల్లీ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఒక్కో ఈక్విటీ షేర్‌ను రూ.16.25కు జారీ చేయనుంది.