Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి)గా ప్రసన్న కుమార్ మోటుపల్లి బాధ్యతలు స్వీకరించారు. ఇంత క్రితం ఆయన గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యా సంస్థ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో గోల్డ్ మెడల్ పొందారు. విద్యుత్, బొగ్గు రంగాల్లో ఆయనకు మూడు దశాబ్దాల పైగా విశేష అనుభవం ఉంది. ఎన్‌టి పిసిలో ప్రసన్న కుమార్ తన కేరీర్‌ను ప్రారంభించారు. తమిళనాడులోని నైవేలీలోని కంపెనీ కార్పొరేట్ ఆఫీసులో నూతన బాధ్యతల స్వీకరణ సమయం లో ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.