Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : అతిపెద్ద బి2బి ఇ-కామర్స్ సంస్థ ఉడాన్ 2022 సంవత్సరంలో 1200 నగరాల వ్యాప్తంగా 170 కోట్ల ఉత్పత్తులను రవాణా చేసినట్లు ప్రకటించింది. అదే సమయంలో ఉడాన్‌పై 586 మంది విక్రేతలు ఒక కోటి రూపాయలకు పైగా వ్యాపార లావాదేవీలను నిర్వహిం చారని పేర్కొంది. 7 కోట్ల ఎలక్టాన్రిక్ ఉత్పత్తులు, 3 కోట్ల పైగా ఉత్పత్తుల ను లైఫ్‌స్టైల్ జనరల్ మర్చండైజ్ విభాగాలలో నిర్వహించడంతో పాటుగా 9 లక్షల టన్నుల నిత్యావసరాలు, 1.5 లక్షల టన్నుల ఎఫ్ఎంసిజి ఉత్పత్తు లను ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా విక్రయించినట్లు తెలిపింది. ఉడాన్ ప్లాట్ ఫామ్‌పై 25 శాతం మంది రిటైలర్లు డిజిటల్ చెల్లింపులను జరిపారని పేర్కొంది.