Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నైట్ ఫ్రాంక్ ఇండియా
హైదరాబాద్: గతేడాది హైదరాబాద్లో 68,519 యూనిట్ల నివాసాల విక్రయాలు జరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. వీటి విలువ రూ.33,605 కోట్లుగా ఉందని పేర్కొంది. ఇంతక్రితం ఏడాది ఇదే కాలానికి రిజిష్టర్ అయిన 83,959 రెసిడెన్షియల్ యూనిట్ల మొత్తం విలువ రూ.37,232 కోట్లుగా నమోదయ్యింది. దీంతో పోల్చితే యూనిట్లు, విలువ పరంగా గతేడాది తగ్గుదల చోటు చేసుకుంది.
హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్లో హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలను పరిగణలోకి తీసుకుంది. 2022 డిసెంబర్లో రిజిష్టర్ అయిన మొత్తం ఇళ్లలో 54 శాతం రూ.25-50 లక్షల ధర శ్రేణిలో ఉన్నాయని తెలిపింది. అధిక టికెట్ సైజ్ ఇళ్లకు డిమాండ్ అధికంగా ఉందని పేర్కొంది. రూ.50 లక్షలు, అంతకు మించి విలువైన ఇళ్ల వాటా 2021 డిసెంబర్లో 24 శాతంగా ఉండగా.. 2022 డిసెంబర్లో అది 29 శాతానికి పెరిగింది.