Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూర్ : ప్లాస్టిక్ పైపులు, ఫిట్టింగ్స్ బ్రాండ్ ట్రూప్లో బై హింద్వేర్ తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. దీనిలో భాగంగా పిటిఎంసి ఫౌసెట్స్, ఫ్లష్ ట్యాంకులు, సీట్ కవరింగ్స్, ఇతర యాక్ససరీలతో కూడిన బాత్ ఫిటింగ్స్ విభాగంలో ప్రవేశిస్తున్నట్లు వెల్లడించింది. పిటిఎంటి ఫౌసెట్స్ కోసం 14 డిజైన్ వేరియంట్లను, 6 ఫ్లష్ ట్యాంక్ వేరియంట్లను విడుదల చేయడం ద్వారా విభిన్నమైన వినియోగదారుల అవసరాలను తీర్చనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. హైదరాబాద్లోని ఇస్నాపూర్ వద్ద ఉన్న తమ రెండవ తయారీ కేంద్రంలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ సదుపాయంతో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 30వేల టన్నుల నుంచి 48 వేల టన్నులకు పెరగనుందని ట్రూప్లో బై హింద్వేర్ లిమిటెడ్ సిఇఒ రాజేష్ పజ్నూ పేర్కొన్నారు.