Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఫోక్స్‌వేగన్ ప్యాసెంజర్ కార్స్ ఇండియా నేడు నూతన అత్యాధునిక సేల్స్ మరియు సర్వీస్ టచ్ పాయింట్‌ను రాజమండ్రిలో ప్రారంభించింది. ఎన్‌హెచ్–16 వద్ద , ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ వెనుక ఉన్న ఈ నూతన 3ఎస్ సదుపాయాన్ని ఫోక్స్‌వేగన్ రాజమండ్రి డీలర్ పార్టనర్ శ్రీ పార్థ్ మోదీ నేతృత్వంలో నిర్వహించనున్నారు.
‘వినియోగదారులే ముందు’ అనే తమ సిద్ధాంతానికి అనుగుణంగా ఈ నూతన సదుపాయంలో 3ఎస్ (సేల్స్,సర్వీస్, స్పేర్స్) సదుపాయాలు ఉండటంతో పాటుగా సమగ్రమైన మరియు సంపూర్ణమైన అనుభవాలను వినియోగదారులకు అందిస్తుంది. ఈ షోరూమ్‌లో 3 కార్లు డిస్ప్లే ఏరియా ఉంటుంది. ఇక్కడ భారతదేశపు అత్యంత సురక్షితమైన ఎస్యువీడబ్యు – టైగున్, చూడగానే ఆకట్టుకునే మరియు ఉత్సాహపరిచే వర్టుస్ మరియు అంతర్జాతీయంగా అత్యుత్తమ సెల్లర్‌గా నిలిచిన టిగున్ను ఫోక్స్‌వేగన్ ప్రదర్శిస్తుంది. మనశ్శాంతితో కూడిన యాజమాన్య అనుభవాలు అందిస్తూ ఈ సదుపాయంలో 4 బేసర్వీస్ ఏరియాలు ఉన్నాయి. ఇది నైపుణ్యంతో కూడిన, సుశిక్షితులైన టెక్నీషియన్ల ద్వారా మా వినియోగదారుల నిర్వహణ అవసరాలను తీర్చడంతో పాటుగా సర్వీస్ అవసరాలు కూడా తీరుస్తుంది.
ఈ నూతన సదుపాయం తెరువడం గురించి శ్రీ అశీష్ గుప్తా, బ్రాండ్ డైరెక్టర్–ఫోక్స్‌వేగన్ పాసెంజర్ కార్స్ ఇండియా మాట్లాడుతూ ‘‘ రాజమండ్రిలో నూతన సదుపాయాన్ని ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా అతి ముఖ్యమైన మార్కెట్లను చేరుకోవాలనే లక్ష్య సాధన దిశగా ఫోక్స్‌వేగన్ సరైన దిశలో వెళ్తుంది. ఈ నూతన టచ్‌పాయింట్, ఔత్సాహిక భారతీయ వినియోగదారుల సమగ్రమైన సేల్స్ మరియు సేవా అవసరాలను తీర్చనుంది. దీనిలో మా పోర్ట్‌ఫోలియోలోని తాజా మరియు నవీన ఉత్పత్తులను సైతం ప్రదర్శించనున్నాము. ఈ ప్రాంతంలోని ప్రస్తుత మరియు సంభావ్య వినియోగదారులకు మనశ్శాంతి మరియు సౌకర్యవంతమైన సేవా అనుభవాలతో పాటుగా ప్రీమియం మొబిలిటీ పరిష్కారాలను సైతం ప్రపంచ శ్రేణి జర్మన్ సాంకేతికతతో అందించగలమనే నమ్మకంతో ఉన్నాము’’ అని అన్నారు.
నూతన డీలర్షిప్ ప్రారంభం గురించి శ్రీ పార్థ్ మోదీ, డీలర్ భాగస్వామి, ఫోక్స్‌వేగన్ రాజమండ్రి (ఎండీచ మోదీ గ్రూప్) మాట్లాడుతూ ‘‘ ఆంధ్రప్రదేశ్‌లో మా ఔత్సాహిక మరియు ప్రీమియం వినియోగదారులు సురక్షిత మరియు ధృడమైన నిర్మాణ నాణ్యత పట్ల అమిత శ్రద్ధ చూపుతున్నారు. ఆఖరకు కారు కొనుగోలు సమయంలో కూడా ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఫోక్స్ వేగన్ ఇండియాతో మా నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారా మేము మా వినియోగదారులకు మరింత చేరువయ్యాం. వారికి అత్యుత్తమ జర్మన్ ఇంజినీరింగ్ మరియు మనశ్శాంతితో కూడిన యాజమాన్య అనుభవాలను సైతం అందించగలము’’ అని అన్నారు. రాజమండ్రిలో మొట్టమొదటి టచ్ పాయింట్‌తో ఫోక్స్ వేగన్ ఇండియా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తమ సేల్స్ టచ్ పాయింట్ల సంఖ్యను 8కు చేర్చింది. భారతదేశంలో ఫోక్స్‌వేగన్ కు 158 సేల్స్ టచ్ పాయింట్లు,118 నగరాలలో 126 సర్వీస్ టచ్పాయింట్ల తో కూడిన నెట్వర్క్ కలిగి ఉంది.