Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కొత్త సంవత్సరంలో రోగి సంరక్షణకు కొనసాగించిన దృష్టితో ప్రారంభించి, సిప్లా లిమిటెడ్ తన రోగులకు ఔట్రీచ్ కార్యక్రమం - బ్రీత్ఫ్రీ యాత్రను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ఆస్థమా లేదా సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) వంటి శ్వాసకు సంబంధించిన తీవ్రమైన సమస్యలను పరీక్షల ద్వారా గుర్తించేందుకు సహకరిస్తుంది. ఈ ధ్యేయం, ఉద్దేశాలతో బ్రీత్ఫ్రీ యాత్ర 300కు పైగా పట్టణాలలో కొనసాగే ప్రణాళిక కలిగి ఉండగా, భారతదేశ వ్యాప్తంగా 60,000కు పైచిలుకు రోగులను మూడు వారాలకు పైగా మద్దతు ఇచ్చే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఉత్తమ రోగ నిర్వహణ ప్రారంభంలో మరియు కచ్చితమైన రోగ నిర్ధారణ పరీక్ష అత్యంత ప్రముఖ చర్యగా ఉంటుంది. అదేమైనప్పటికీ, గ్లోబల్ ఆస్థమా నెట్వర్క్ (GAN) అధ్యయనం ప్రకారం 82% వరకు ప్రస్తుతం ఉబ్బసంతో ఇబ్బంది పడుతున్నారు మరియు 70% వరకు రోగులలో తీవ్రమైన ఆస్థమా లక్షణాలను గుర్తించకుండానే మిగిలిపోతాయి1! సీఓపీడీ కేసులలో భారతదేశంలో 95% నుంచి 98% వరకు రోగ పరీక్షలు చేయించుకోరు. 2 ఈ చేదు నిజానికి పలు కారణాలు ఉన్నాయి, అయితే సరైన వైద్య సదుపాయాల అందుబాటు ప్రముఖ పాత్ర పోషిస్తుంది3. దానితో రోగికి ఉత్తమ మద్దతు చర్యలు అవసరం అవుతుండగా, అది ఆస్థమా రోగులకు వారి సమస్యను ప్రారంభంలోనే గుర్తించేందుకు సహకరిస్తుంది. దీనితో వారికి వారి పరిస్థితి నియంత్రించుకునుందుకు మరియు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు సహకరిస్తుంది.
క్లినికల్ డైరెక్టర్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ మరియు సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, డా.జయచంద్ర అక్కరాజు ప్రకారం ‘‘తీవ్రమైన శ్వాస సంబంధిత రోగమైన ఆస్థమాను పూర్తిగా నయం చేయడం సాధ్యం కానప్పటికీ పరిస్థితిని నియంత్రించడం సాధ్యమవుతుంది మరియు ప్రారంభంలోనే రోగ నిర్ధారణతో అలాగే సకాలంలో వైద్య చికిత్సలను అందించడం ద్వారా సహజమైన జీవితాన్ని గడపడం సాధ్యమవుతుంది4. అదేమైనప్పటికీ పలుసార్లు చిన్న పట్టణాలలో ఉండే రోగులు తమకు కావలసిన వైద్య చికిత్సల విషయంలో నిర్యక్ష్యం చూపిస్తారు లేదా ఆస్థమాకు సంబంధించిన రోగ లక్షణాలపై వారికి అవగాహన కలిగి ఉండరు. దీనికి అనుగుణంగా ఈ రోగంతో పాటే సామాజిక రుగ్మతలు రోగ పరీక్ష లేదా చికిత్స పొందాలని కోరుకునే వారికి అడ్డుగా ఉంటుంది మరియు జాగృతి అవసరం ఎక్కువగా ఉంది. ఈ కారణాలను దృష్టిలో ఉంచుకుని బ్రీత్ఫ్రీ యాత్ర వంటి కార్యక్రమాల ద్వారా రోగ పరీక్ష మరియు రోగికి వైద్య సలహాల ద్వారా వైద్య సహకారాన్ని అందిస్తోంది. ఇది రోగులకు వారి ఆరోగ్య పరిస్థితిని ఉత్తమ విధానాలలో అర్థం చేసుకునేందుకు సహకరించడం ద్వారా వారి జీవితాలలో సహజమైన మార్పును తీసుకు వచ్చేందుకు సహకరిస్తుంది’’ అని వివరించారు.
‘కేరింగ్ ఫర్ లైఫ్’ మార్గదర్శకత్వపు ప్రయోజనాలలో రోగులు ఎల్లప్పుడూ కార్యక్రమానికి అనుసంధానమై ఉంటారు. అత్యంత సమగ్ర విధానంలో రోగికి మద్దతు ఇచ్చే కార్యక్రమాలలో ఒకటైన బ్రీత్ఫ్రీ రోగులకు సంపూర్ణ రోగ చికిత్సకు మద్దతు ఇచ్చే ప్రయాణాన్ని కలిగి ఉండగా, అందులో రోగ పరీక్ష, కౌన్సెలింగ్ మరియు చికిత్సకు మద్దతు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో విస్తృతంగా ప్రత్యేక శిక్షకులు, దేశ వ్యాప్తంగా అనుకూలతను పొందే రోగులు, పలు కార్యక్రమాల ద్వారా కలిసి ఉండగా, అందులో బ్రీత్ఫ్రీ యాత్ర వంటి వినూత్న కార్యక్రమాలు కలిసి ఉంటాయి. ఈ ఉద్దేశాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లే దిశలో బ్రీత్ఫ్రీ కార్యక్రమం తన పరిధిని భారతదేశంలో మొదటి డిజిటల్ ఎడ్యుకేటర్ ఫర్ ఇన్హలేషన్ డివైజ్ను వినియోగించేందుకు శిక్షణ, బ్రీత్ఫ్రీ డిజిటల్ ఎడ్యుకేటర్ ద్వారా వ్యాప్తిని కలిగి ఉంది. సరైన డివైజ్ టెక్నిక్, డివైజ్ నిర్వహణతో ఇన్హెలర్లు అవసరం మరియు వద్దు అనే అంశాలను ఏడు భాషలలో అందిస్తుండగా, ఈ ప్లాట్ఫారం దేశ వ్యాప్తంగా ఆస్థమా రోగులకు మరొక పొర సంరక్షణ మరియు మద్దతు చేర్చగా రోగులకు ఉత్తమ ఫలితాలను సాధ్యం అయ్యేలా చేస్తుంది.