Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రీమియర్ వినియోగదారుల ఆర్థిక సేవల కంపెనీ సింక్రోనీ (ఎన్వైఎస్ఈ : ఎఫ్వైఎఫ్) ఇప్పుడు ‘ఎడ్యుకేషన్ యాజ్ యాన్ ఈక్వలైజర్’ కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా ఉన్నత విద్యావకాశాలు పెంపొందించడం, అత్యధిక వృద్ధి అవకాశాలు కలిగిన రంగాలలో నైపుణ్య శిక్షణ మరియు నిరుపేద కమ్యూనిటీలతో పాటుగా సింక్రోనీ వర్క్‌ఫోర్స్‌కు ఆర్ధిక అక్షరాస్యత అందించడం చేయనున్నారు. మెంటార్షిప్ మరియు ఇతర కార్యక్రమాల ద్వారా సంస్ధ యొక్క ఉద్యోగ నైపుణ్యం మరియు ప్రతిభపై ఆధారపడి ఈ ప్రోగ్రామ్‌ను సింక్రోనీ యొక్క నిబద్ధతపై ఆధారపడి, మన కమ్యూనిటీల లోపల లోతైన ఆర్ధిక అసమానతల సమస్యలకు తగిన పరిష్కారం అందించేలా ఈ కార్యక్రమం రూపొందించబడింది.
సింక్రోనీ ఫౌండేషన్ ఇప్పుడు స్కాలర్షిప్లు మరియు మెంటార్‌షిప్స్ అందించేందుకు 55000 డాలర్ల వార్షిక గ్రాంట్‌ను అందించేందుకు కట్టుబడింది. ఈ గ్రాంట్‌ను భారతదేశంలోని అల్పాదాయ వర్గాల విద్యార్ధులకు అందించనున్నారు. బాలికా విద్య పట్ల కంపెనీ అధికంగా దృష్టి సారించడంతో సింక్రోనీ ప్రస్తుతం 119 మంది విద్యార్ధులకు ఈ ప్రోగ్రామ్ ద్వారా మద్దతు అందిస్తుంది. వీరిలో 88% మంది మహిళా విద్యార్ధులు ఉన్నారు.
‘‘నాణ్యమైన విద్యను పొందడం, నైపుణ్యాభివృద్ధి అనేవి పెను సవాళ్లుగా నిలుస్తుంటాయి. మరీ ముఖ్యంగా బీద వర్గాలకు చెందిన మహిళా విద్యార్ధులకు ఇది మరింత సవాల్‌గా నిలుస్తుంటుంది. సింక్రోనీ యొక్క ‘ఎడ్యుకేషన్ యాజ్ యాన్ ఈక్విలైజర్’ కార్యక్రమం ద్వారా ఈ సవాళ్లకు తగిన పరిష్కారాలను అందించడంతో పాటుగా సంతోషకరమైన భవిష్యత్‌కు మెరుగైన విద్యను పొందేలా బాలికలు, మహిళలకు తోడ్పడనుంది. ఈ కార్యక్రమానికి అపూర్వమైన స్పందన లభించింది. మన సమాజంలో సానుకూల ప్రభావం చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’అని ఆండీ పొన్నేరీ, ఎస్వీపీ– బిజినెస్ లీడర్, ఇండియా అన్నారు.
ఈ కార్యక్రమం గురించి కామేశ్వరి గంగాధర్భట్ల, వైస్ ప్రెసిడెంట్– హ్యూమన్ రిసోర్శెస్– ఆసియా డైవర్శిటీ అండ్ రిక్రూట్మెంట్ సీఈఓ లీడర్ మాట్లాడుతూ ‘‘విద్య మనందరికీ సాధికారితనందిస్తుంది. కొవిడ్ మహమ్మారి నాటి నుంచి, మొత్తం విద్యా మౌలిక సదుపాయాలు పూర్తిగా మారాల్సిన ఆవశ్యకత వైల్లడైంది. మరీ ముఖ్యంగా మహిళలు, బాలికల విద్య పరంగా ఈ మార్పులు అనివార్యమయ్యాయి. స్థోమత సమస్యల కారణంగా విద్య లాంటి ప్రాధమిక హక్కు ప్రతి ఒక్కరికీ చేరువవుతుందనే భరోసాను సింక్రోనీ అందిస్తుంది. సమ్మిళితను జోడించడం ద్వారా, ఈక్వలైజర్ కార్యక్రమం రూపంలో విద్య యొక్క సానుకూల వేగాన్ని కొనసాగించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.
‘‘అట్టడుగు వర్గాలకు చెందిన యువకులకు ఉన్నత విద్యను చేరువ చేయడం మరియు వారు గ్రాడ్యుయేట్ అయ్యేలా చూడటం కంటే విజయవంతమైన రీతిలో లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్స్‌ను అందించడానికి మించి ప్రభావం చూపే మరో అంశమేమీ లేదు. యునైటెడ్ వే హైదరాబాద్ ఇప్పుడు సింక్రోనీ ఫైనాన్షియల్స్ కోసం ఎడ్యుకేషన్ యాజ్ యాన్ ఈక్వలైజర్ స్కాలర్‌షిప్స్‌ను నిర్వహిస్తుండటం పట్ల సంతోషంగా ఉంది. ఈ స్కాలర్షిప్ గ్రహీతలు తమ కోర్సులను పూర్తి చేసేంత వరకూ తగిన మద్దతు అందించడానికి కట్టుబడిన వారి నిబద్ధతను ప్రశంసిస్తున్నాము’’ అని గిరిజ తుల్పులీ, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ అన్నారు.
నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఫౌండర్, సీఈఓ మయూర్ పట్నాల మాట్లాడుతూ ‘‘ఎడ్యుకేషన్ యాజ్ యాన్ ఈక్వలైజర్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. దీనికి సింక్రోనీ తగిన మద్దతు అందిస్తుంది. ఈ కార్యక్రమం కింద 52 మంది బాలికా విద్యార్ధులకు మద్దతు అందిస్తున్న సింక్రోనీకి ధన్యవాదములు తెలుపుతున్నాము. ఎడ్యుకేషన్ యాజ్ యాన్ ఈక్వలైజర్ కార్యక్రమం కింద రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. అవి నైపుణ్య శిక్షణ మరియు స్కాలర్షిప్లు.
స్కిల్ ప్రాజెక్ట్ కింద, బీద వర్గాలకు చెందిన 45 మంది బాలికలు (ఫతేనగర్ మరియు చుట్టు పక్కల ప్రాంతాలు) కు ఐటీ ఆధారిత సేవల నైపుణ్యాలపై శిక్షణ అందించడంతో పాటుగా 28 మంది బాలికలకు ఎంఎన్సీలలో ఉపాధినీ అందించారు.
స్కాలర్షిప్స్ ప్రాజెక్ట్ కింద, ఉన్నత విద్య కోసం మహిళలను ప్రోత్సహించడంలో భాగంగా మరీ ముఖ్యంగా స్టెమ్ విద్యలో ప్రోత్సాహాన్ని అందిస్తూ , ఏడుగురు బాలికలకు మద్దతు అందించారు. ఈ బాలికలు సెమీ ఆర్ఫన్ మరియు బీపీఎల్ వర్గాలకు చెందిన వారు కావడంతో పాటుగా అత్యంత ప్రతిభావంతులు. వీరికి బీటెక్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు తగిన మద్దతు అవసరం పడటంతో పాటుగా గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేంత ఈ అవసరం పడుతుంది. నిర్మాణ్ మరియు స్కిల్లింగ్ , స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్‌ల కోసం విద్యార్థులు ఇప్పుడు సింక్రోనీ కి తమ ధన్యవాదములను ఈ అద్భుత అవకాశం అదించినందుకు అందించారు. అలాగే ఈ చిన్నారుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లల భవిష్యత్‌కు మార్గం వేసిన సింక్రోనీకి కృతజ్ఞతలు తెలిపారు’’ అని అన్నారు.
‘‘దాదాపు 61 మంది నిరుపేద కాలేజీ విద్యార్థులు (50 మంది మహిళలు మరియు 11 మంది పురుషులు)కు స్కాలర్షిప్లను అందిస్తున్న సింక్రోనీ ఫౌండేషన్‌కు ధన్యవాదములు తెలుపుతున్నాము. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ప్రాంతానికి చెందిన విద్యార్ధులకు ఎడ్యుకేషన్ యాజ్ యాన్ ఈక్విలైజర్ కింద మద్దతు తెలుపుతుంది. ఈ తరహా మద్దతు ఈ విద్యార్థులు మరియు కుటుంబాలకు భారీ ప్రోత్సాహం మరియు ఆత్మవిశ్వాసాన్ని ఉన్నత విద్య అభ్యసించేందుకు అందిస్తుంది. దానితో పాటుగా తమ విద్య ద్వారా భావి తరపు భవిష్యత్ ను సైతం మార్చగలరు’’ అని రంగారావు జాస్తి, డైరెక్టర్, అసిస్ట్ అన్నారు.
విద్యాసంస్ధలు, లాభాపేక్ష లేని సంస్ధలు, ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ స్కాలర్షిప్లను అందుకున్న వ్యక్తులను వారి ప్రతిభ, అవసరాలను పరిగణలోకి తీసుకుని తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా ఎంపిక చేశారు. సింక్రోనీ యొక్క నాన్ ప్రాఫిట్ భాగస్వాములు – అసిస్ట్, నిర్మాణ్ ఆర్గనైజేషన్, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ మద్దతో 79 మంది విద్యార్థులను ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్ కోర్సులు అయినటువంటి బీఏ, బీకామ్, బీఎస్సీ, ఫార్మా, నర్సింగ్ , బీటెక్, ఎంబీబీఎస్ కోర్సుల కోసం ఎంపిక చేశారు. దీనిలో 40 మంది బాలికలను అప్‌స్కిల్లింగ్ మరియు ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమాల కోసం ఎంపిక చేశారు. ఈ విద్యార్ధులు సాధారణంగా ఆర్థికంగా వెనుకబడిన గిరిజన, గ్రామీణ మరియు నగర ప్రాంతాల వారై ఉంటారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ వారు ప్రభుత్వ యూనివర్శిటీలు, ప్రైవేట్ విద్యా సంస్థలు, యూనివర్శిటీలు, జాతీయస్ధాయి ప్రీమియర్ విద్యాసంస్థలలో విద్యనందిస్తుంది.