Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అప్రెంటిస్‌షిప్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటుగా భారతీయ యువత అప్రెంటిస్‌షిప్‌ను స్వీకరించేలా చేయడానికి నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్ధాపక మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డీఈ) దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో 250కు పైగా వర్క్‌షాప్‌లను నిర్వహించనుంది. తద్వారా సంస్థలు, ఔత్సాహికులు, భాగస్వాముల నడుమ అప్రెంటిస్‌షిప్ సంస్కరణల పట్ల అవగాహన కల్పించనున్నారు. రీజనల్ డైరెక్టోరేట్, స్కిల్ డెవలప్‌మెంట్ మరియు ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ సంబంధిత ప్రాంతాలలో ఈ కార్యక్రమాలను నిర్వహించనుంది.
తెలంగాణా రాష్ట్రానికి సంబంధించి తొలి వర్క్‌షాప్‌ను హైదరాబాద్‌లో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ వద్ద జనవరి 24, 2023న నిర్వహించనున్నారు. రోజంతా జరిగే ఈ కార్యక్రమాన్ని తెలంగాణా రాష్ట్ర ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీమతి ఐ.రాణి కుముదిని, ఐఏఎస్ ప్రారంభించనున్నారు. ఈ వర్క్‌షాప్‌లో రీజనల్ డైరెక్టోరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ (ఆర్‌డీఎస్‌ఈలు), బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ (బోట్) , రాష్ట్ర ప్రభుత్వ జిల్లా నైపుణ్యాభివృద్ధి కమిటీ (డీఎస్‌సీ), జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పోరేషన్ (ఎన్‌ఎస్‌డీసీ) , విద్యా సంస్ధలు, పరిశ్రమ భాగస్వాములు, సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ (ఎస్‌ఎస్‌సీ)లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం గురించి నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంతిత్వ్రశాఖ (ఎంఎస్‌డీఈ) కార్యదర్శి అతుల్ కుమార్ తివారీ మాట్లాడుతూ అప్రెంటిస్‌షిప్ సంస్కరణలతో ప్రతిభావంతుల అవసరాలతో పాటుగా సుశిక్షితులైన యువత కోరుకునే పరిశ్రమ అవసరాలు సైతం తీరతాయి అని అన్నారు. అప్రెంటిస్‌షిప్ చట్టంలో మార్పులు కారణంగా మన యువత అత్యుతమ శిక్షణ పొందగలరు అని అన్నారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల సరఫరా మరియు డిమాండ్ మధ్య ఉన్న అంతరాలను పూరించడానికి మంతిత్వ్రశాఖ పలు కార్యక్రమాలను పలువురు వాటాదారులతో చర్చించి ప్రారంభించింది. ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా (పీఎంఎన్‌ఏఎం) ప్రతి నెలా రెండవ సోమవారం కంపెనీలు/సంస్థలు మరియు అభ్యర్ధులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి యువతకు పలు అవకాశాలను అందిస్తుంది. ఈ వర్క్‌షాప్‌ను ఎంఎస్‌డీఈ, ఎన్‌ఎస్‌డీసీ, నిమి, ఎంఎస్‌ఎంఈ, డీఐ, ఆర్‌డీఎస్‌డీఈల మార్గనిర్దేశకత్వంలో నిర్వహిస్తున్నారు.