Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోల్పోతున్న ఉద్యోగాలు
- కొత్త జాబ్‌ల కోసం తంటాలు
- దగ్గర పడుతున్న వీసా గడువు
న్యూఢిల్లీ : అమెరికాలో పని చేస్తున్న భారత టెకీలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అక్కడి ఐటి కంపెనీలు వరుసగా ఉద్యోగులను తొలగించడం వారిని తీవ్ర వేదనకు గురి చేస్తుందని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. యుఎస్‌లో ఉద్యోగాలు పొగొట్టుకున్న భారతీయుల పరిస్థితి వర్ణనాతీంగా ఉందని ఇందులో పేర్కొంది. ఆ దేశంలో పని చేస్తున్న వేలాది మంది భారతీయ ఐటి ఉద్యోగులు ఉద్వాసనకు గురైతున్నారు. ఇప్పటికే తొలగింపులకు గురైన వారు తీవ్ర ఆందోళనలో ఉండగా.. ఉన్న ఉద్యోగులు ఎప్పుడు తమను ఇంటికి పంపుతారో అనే భయాందోళనలో గడుపుతున్నారు. ఆర్థిక అనిశ్చిత్తుల నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు అమెరికాలోని టెక్ కంపెనీలు కోతలకు దిగిన విషయం తెలిసిందే. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థలు సహా అనేక టెక్ కంపెనీలు ఇటీవల వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. గతేడాది నవంబరు నుంచి ఇప్పటివరకు దాదాపు 2లక్షల మంది ఐటి సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారని అంచనా. ఇందులో 30 నుంచి 40శాతం మంది భారత ఐటి నిపుణులే కావడం గమనార్హం. వీరిలో మెజార్టీ ఉద్యోగులు హెచ్-1బి, ఎల్1 వీసాలతో అమెరికాలో నివసిస్తున్నారు. దీంతో అమెరికాలో ఉండటానికి వీరంతా కొత్త ఉద్యోగాల కోసం వేట ప్రారంభించారు. గడువులోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి.. లేదా వీసా స్టేటస్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. భారత టెకీల పరిస్థితి దారుణంగా ఉందని, చాలా కష్టంగా గడుస్తోందని ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ''ముఖ్యంగా హెచ్-1బి వీసాదారులకు మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. వీరు విధుల నుంచి తొలగిపోయిన 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగాన్ని సంపాదించాలి. అలాంటి వీసాదారులకు టెక్ కంపెనీలు కొన్ని మినహాయింపులు ఇస్తే బాగుంటుంది. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్లో ఉన్న సమస్యల కారణంగా వీరి వీసా రద్దు తేదీని కొన్ని నెలలు పొడిగించాలి.'' అని సిలికాన్ వ్యాలీకి చెందిన ఔత్సాహికవేత్త అజరు జైన్ భుటోరియా పేర్కొన్నారు.