Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకాశ ఎయిర్ వెల్లడి
ప్రతీ 15 రోజులకు ఒక కొత్త విమానాన్ని జోడించుకోవడం ద్వారా మెట్రో, చిన్న నగరాలకు కనెక్టివిటీని పెంచుకోనున్నామని ఆకాశ ఎయిర్ సహ వ్యవస్థాపకులు, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు బెల్సన్ కౌటినోతో కలిసి ఆయన మాట్లాడుతూ.. కొత్తగా తమ నెట్‌వర్క్‌లో 13వ గమ్యస్థానం హైదరాబాద్ నుంచి రోజువారీ విమాన సేవలను ప్రారంభించినట్టు తెలిపారు. జనవరి 25 నుంచి హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్ - గోవా మధ్యన కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.
దీంతో 21 రూట్లలో వారానికి 575 విమానాలకు చేరినట్లయ్యిం దన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణీ నగరాలపై దృష్టి కేంద్రీకరిస్తు న్నామన్నారు. ప్రస్తుతం తమ వద్ద 14 విమానాలు ఉన్నాయని.. 2023 మార్చి ముగింపు నాటికి 18కి చేరనున్నాయన్నారు.