Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్యరాజ్య సమితి అంచనా
వాషింగ్టన్ : ప్రస్తుత ఏడాది 2023లో ప్రపంచ వృద్థి రేటు 1.9 శాతానికే పరిమితం కావొచ్చని ఐక్య రాజ్య సమితి అంచనా వేసింది. ఉక్రె యిన్-రష్యా ఆందోళనలకు తోడు ఆహారం, ఇంధన సంక్షోభం వృద్థి రేటును దెబ్బతీయనుందని విశ్లేషించింది. ఆర్థిక అనిశ్చితి చోటు చేసుకో నుందని 'యూఎన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ ఎఫెర్స్' రిపోర్ట్‌లో పేర్కొంది. 2023లో అభివృద్థి చెందిన, చెందుతున్న దేశాల్లోనూ మందగమనం చోటు చేసుకోనుందని తెలిపింది. దీనిపై 178పేజీల రిపోర్టును రూపొందించింది. ''అధిక ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య పరపతి విధానం, పెరిగిన అనిశ్చిత్తుల మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించ నుంది.'' అని యూఎన్ సెక్రెటరీ జనరల్ అరటోనియో గుటెర్రెస్ పేర్కొ న్నారు. ''ప్రస్తుత ఏడాదిలో గ్లోబల్ వృద్థి 1.9 శాతంగా ఉండొచ్చు. 2022 లో 3 శాతంగా అంచనా వేసింది. ఇటీవలి దశాబ్ద కాలంలో ఇదే అత్యల్ప వృద్థి రేటు కానుంది. ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పట్టి, ఆర్థికంగా ఎదురుగాలి తగ్గడం ప్రారంభిస్తే 2024లో ఇది 2.7 శాతానికి పెరగ నున్నదని అంచనా.'' అని ఈ రిపోర్టు పేర్కొంది. ఇటీవల ప్రపంచ బ్యాంక్ కూడా గ్లోబల్ వృద్థి రేటు అంచనాలను 3 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గించింది. 2022లో 3.2 శాతం వృద్థి, 2023లో 2.7 శాతం పెరుగుదల ఉండొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. 2023 కష్టతరమైన సంవత్సరంగా సాగనుందని గత వారం దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరంలో ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు. ఇదే సమావేశాల్లో ప్రపంచంలో పెరుగుతున్న ఆదాయ అసమానతలను యుఎన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ ఎఫైర్స్ డివిజన్ డైరెక్టర్ శాంతను ముఖర్జీ ఎత్తిచూపారు. ''ఈ సంవత్సరం యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్, ఇతర అభివద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో వద్ధి బలహీనంగా ఉంది. ఇది మిగిలిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసింది. 2023లో అమెరికా వృద్థి ఏకంగా 0.4 శాతానికి పడిపోనుంది. 2022లో ఇది 1.8 శాతంగా ఉండొచ్చు. అనేక యూరోపియన్ దేశాల వృద్థి కూడా మందగించనుంది. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు ద్రవ్యోల్బణ పెరుగుదల, కఠిన ద్రవ్య పరపతి విధానాలు, పడిపోయిన కుటుంబాల ఆదాయం, పెట్టుబడులు వృద్థి రేటును ఒత్తిడికి గురి చేస్తున్నాయి'' అని యూఎన్ రిపోర్ట్ పేర్కొంది.