Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
డీపీ వరల్డ్ ఐఎల్‌టి20 (ILT20) లీగ్‌లో కీరన్ పోలార్డ్‌కు బౌలింగ్ చేసేందుకు వేచి చూస్తున్నానని జీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ గల్ఫ్ జెయింట్స్ మరియు యూఏఈ బౌలర్ సంచిత్ శర్మ తెలిపారు. ఫ్రాంచైజీ తరహాలో నిర్వహిస్తున్న టోర్నమెంట్ – డీపీ వరల్డ్ ఇంటర్నేషనల్ లీగ్ టీ 20లో ఆరు జట్లు మరియు 34 మ్యాచ్‌లు ప్రస్తుతం యూఏఈలో నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు జీ లీనియర్ ఛానెళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్, జీ5 అలాగే, జీ సినిమా ఎస్‌డీ, జీసినిమా హెచ్‌డీ, జీ అన్‌మోల్ సినిమా & పిక్చర్స్ హెచ్‌డీ & ఫ్లిక్స్ ఎస్‌డీ & ఫిక్స్ హెచ్‌డీ, జీ జెస్ట్ ఎస్‌డీ, జీ జెస్ట్ హెచ్‌డీ, జీ బంగ్లా సినిమా, జీ తిరై మరియు యూఏఈ మరియు ఎంఇఎన్ఏ ప్రాంతాలలో క్రిక్‌లైఫ్‌లో ఈ ఉత్తేజకరమైన క్రికెట్ లీగ్ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించవచ్చు.
కీరన్ పొలార్డ్‌కు బౌలింగ్ చేయాలని కోరుకుంటున్న విషయమై సంచిత్ శర్మ మాట్లాడుతూ, ‘‘అవును, స్పష్టంగా చెప్పాలంటే, ప్రతి జట్టులో కొంతమంది ఆటగాళ్లకు నేను బౌలింగ్ చేయాలని కోరుకుంటూ, అవకాశం కోసం వేచి చూస్తున్నాను. ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాడు కీరాన్ పొలార్డ్‌కు కచ్చితంగా బౌలింగ్ చేయడంతో పాటు, అతన్ని ఔట్ చేసి, ఆ క్షణాలను ఆస్వాదించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.
డీపీ వరల్డ్ ఐఎల్‌టీ20 మ్యాచ్‌లు 13 జనవరి 2023న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభం అయ్యాయి. లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో ఆడేందుకు కొంతమంది గొప్ప క్రికెట్ సూపర్ స్టార్‌లు ఇప్పటికే యూఏఈకి చేరుకున్నారు. టోర్నమెంట్ ప్రస్తుతం యూఏఈకి ఆదర్శవంతమైన, ప్రపంచ స్థాయి క్రికెట్ సౌకర్యాలు ఉన్న దుబాయ్, అబుదాబి మరియు షార్జాలలో 34-మ్యాచ్ ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. ఇందులో 100 మంది అంతర్జాతీయ మరియు 24 యూఏఈకి చెందిన ఆటగాళ్లతో కూడిన ఫ్రాంచైజ్ జట్లలో అబుదాబి నైట్ రైడర్స్ (నైట్ రైడర్స్ గ్రూప్), డెసర్ట్ వైపర్స్ (లాన్సర్ క్యాపిటల్), దుబాయ్ క్యాపిటల్స్ (GMR), గల్ఫ్ జెయింట్స్ (అదానీ స్పోర్ట్స్‌లైన్), ఎంఐ ఎమిరేట్స్ (రిలయన్స్ ఇండస్ట్రీస్) మరియు షార్జా వారియర్స్ (కాప్రి గ్లోబల్) ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు జీ లీనియర్ ఛానెళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్, జీ5 అలాగే, జీ సినిమా ఎస్‌డీ, జీసినిమా హెచ్‌డీ, జీ అన్‌మోల్ సినిమా & పిక్చర్స్ హెచ్‌డీ & ఫ్లిక్స్ ఎస్‌డీ & ఫిక్స్ హెచ్‌డీ, జీ జెస్ట్ ఎస్‌డీ, జీ జెస్ట్ హెచ్‌డీ, జీ బంగ్లా సినిమా, జీ తిరై మరియు యూఏఈ మరియు ఎంఇఎన్ఏ ప్రాంతాలలో క్రిక్‌లైఫ్‌లో ఈ ఉత్తేజకరమైన క్రికెట్ లీగ్ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించవచ్చు.
28 జనవరి 2023 షెడ్యూల్:
షార్జా వారియర్స్ vs అబుదాబి నైట్ రైడర్స్ – మధ్యాహ్నం 3:30 IST – షార్జా క్రికెట్ స్టేడియం
దుబాయ్ క్యాపిటల్స్ vs డెసర్ట్ వైపర్స్ – రాత్రి 7:30 IST – దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం