Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
గ్యారెంటీడ్ రిటర్న్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అత్యధికంగా 7.5% రాబడులను పొందవచ్చు
సరైన పెట్టుబడి పధకం అయితే అత్యధిక రాబడులను అందించడంతో పాటుగా పన్ను ప్రయోజనాలను సైతం అందిస్తుంది. తద్వారా మీరు ద్రవ్యోల్బణ పరిస్ధితిలను అధిగమించడంతో పాటుగా మీ కొనుగోలు శక్తిని సైతం కొంతకాలానికి మెరుగుపరుచుకోవచ్చు.
గ్యారెంటీడ్ రిటర్న్ ప్లాన్‌లో వినూత్న అంశమేమిటంటే ఇవి రిస్క్ ఫ్రీ రాబడులను మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా అందిస్తాయి. అత్యధిక, పన్నురహిత మరియు పెట్టుబడులపై గ్యారెంటీడ్ రాబడులు ఈ ప్లాన్‌కు మదుపరుల నడుమ అత్యంత ప్రాచుర్యం కల్పించాయి. నూతన తరపు ప్లాన్స్‌లో రాబడులు 7.5%గా ఉంటాయి. దీర్ఘకాలపు సంపద సృష్టిలో ఇది ఆకర్షణీయంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మార్కెట్‌లో సంప్రదాయపరంగా లభించే పెట్టుబడి అవకాశాలతో పోలిస్తే ఇది ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ప్రొడక్ట్‌లోని జీవిత భీమా అంశం కేవలం పన్ను ఆదా చేయడంతో పాటుగా ఆధారపడిన వారికి రక్షణ సైతం అందిస్తుంది. ఈ ఫీచర్లు గ్యారెంటీడ్ రిటర్న్స్ ప్లాన్స్‌ను సమగ్రమైన పెట్టుబడి అవకాశంగా మారుస్తుంది్ణ్ణ అని వివేక్ జైన్, హెడ్‌ఉ ఇన్వెస్ట్‌మెంట్స్, పాలసీబజార్ డాట్ కామ్ అన్నారు.
ఎఫ్‌డీ, ఆర్‌డీ మరియు పీపీఎఫ్‌లతో పోలిస్తే గ్యారెంటీడ్ లేదా ఫిక్స్‌డ్ రిటర్న్ ప్లాన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు:
గ్యారెంటీడ్ రిటర్న్ ప్లాన్స్‌ను ఎఫ్‌డీలతో పోల్చినప్పుడు : ఎఫ్‌డీలలో పెట్టుబడులను పెద్దమొత్తంలో పెట్టాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ కాలంలో ఇన్వెస్టర్ మరణించిన ఎడల పెట్టుబడిపై ప్రభావం ఉండదు. కానీ ప్రీ మెచ్యూర్ విత్‌డ్రాయల్ చేస్తే ఎఫ్‌డీ వడ్డీలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నామినీ లేదా ఆధారపడిన వ్యక్తులు అతి తక్కువ రాబడులను పొందుతారు.
గ్యారెంటీడ్ రిటర్న్ ప్లాన్స్ తో ఆర్‌డీలను పోలిస్తే : పీరియాడిక్ ప్రీమియం చెల్లింపులు, గ్యారెంటీడ్ లేదా ఫిక్స్‌డ్ రిటర్న్ ప్లాన్స్ ఆర్‌డీల్లాగానే ఉంటాయి. అయితే ఆర్‌డీల్లో ఒకవేళ ఇన్వెస్టర్ చనిపోతే పెట్టుబడులు ఆగిపోతాయి. తద్వారా మెచ్యూరిటీ విలువ కూడా తక్కువగా వస్తుంది. మరోవైపు భీమా కవరేజీ కారణంగా, గ్యారెంటీడ్ లేదా ఫిక్స్‌డ్ రిటర్న్ ప్లాన్ ఎలాంటి పన్ను భారం లేకుండా పూర్తి మోచ్యూరిటీ విలువ అందిస్తుంది.
గ్యారెంటీడ్ రిటర్న్ ప్లాన్స్‌తో పీపీఎఫ్‌లను పోల్చినప్పుడు : సాధారణంగా ఎఫ్‌డీ, ఆర్‌డీ రేట్లతో పోలిస్తే పీపీఎఫ్‌లు ఎక్కువ వడ్డీ రేటు అందిస్తాయి. గ్యారెంటీడ్ లేదా ఫిక్స్‌డ్ రిటర్న్ ప్లాన్స్ ఇప్పుడు ఈఈఈ ట్యాక్స్ హోదాను పీపీఎఫ్‌లా ఆస్వాదిస్తున్నాయి. కొన్ని ప్లాన్స్‌లో ఎఫ్‌డీలు, ఆర్‌డీల కంటే అత్యధిక రేట్లు వస్తాయి.
రాబడి రేటు పీపీఎఫ్ రేట్ ను సెప్టెంబర్ 2022తో ముగిసిన త్రైమాసానికి 7.1 %గా నిర్ణయించారు. దీనిని ప్రతి త్రైమాసం సమీక్షిస్తారు. గ్యారెంటీడ్ రిటర్న్ ప్లాన్స్‌లో మదుపరులు 7.2% రాబడులను 10 సంవత్సరాల పాటు పొందవచ్చు.