Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఎంపీవీ విభాగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ప్రతిష్టాత్మిక ఇన్నోవా. ఈ వాహనం మొదటి తరపు మోడల్‌ను 2005లో విడుదల చేశారు. ఇప్పటి వరకూ ఒక మిలియన్‌కు పైగా యూనిట్ల విక్రయాలను జరుపుకుంది. ప్రతిష్టాత్మక ఇన్నోవా క్రిస్టా , సరికొత్త ,ధృడమైన మరియు రగ్డ్ ఫ్రంట్ ఫాసియా కలిగి ఉంది. ఇప్పుడు నాలుగు గ్రేడ్లలో డీజిల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో లభిస్తున్నాయి. అవి జెడ్ఎక్స్ (7 సీట్లు), వీఎక్స్ (7/8 సీట్లు), జీఎక్స్ (7/8 సీట్లు) జీ(7/8 సీట్లు) 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో శక్తివంతం. దీనిలో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎకో మరియు పవర్ డ్రైవ్ మోడ్స్‌లో కలిగి ఉంటాయి. భద్రతా ఫీచర్లలో భాగంగా 7 ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్‌లు, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు, వాహన స్థిరత్వ నియంత్రణ, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్),ఎలకా్ట్రనిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ), బ్రేక్ అసిస్ట్ (బీఏ), 3 పాయింట్ సీట్‌బెల్ట్, మెరుగైన భద్రత కోసం హెడ్ రెస్ట్ ఉన్నాయి.
డిజిటల్ డిస్ప్లేతో రియర్ ఆటో ఏసీతో మెరుగైన ప్యాసెంజర్ సౌకర్యం ; 8 వే పవర్ ఎడ్జస్ట్ డ్రైవర్ సీట్, స్మార్ట్ ఎంట్రీ సిస్టమ్, సీట్ బ్యాక్ టేబల్, సవివరమైన డ్రైవ్ సమాచారంతో టీఎఫ్టీ మిడ్ , లెదర్ సీట్ కలర్ అవకాశాలు (బాలక్ మరియు క్యామెల్ ట్యాన్), యాంబియంట్ ఇల్యుమినేషన్ మరియు ఒన్ టచ్ టంబెల్ సెకండ్ రో సీట్లు ఉన్నాయి. స్మార్ట్ ప్లేకాస్ట్ 8 అంగుళాల టచ్ స్ర్కీన్ ఆడియో , ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్ ప్లే, మహోన్నత మల్టీ మీడియా అనుభవాలను అందిస్తాయి. బెంగళూరు, 29 జనవరి 2023 : టయోటా కిర్లోస్కర్ మోటర్ (టీకెఎం)నేడు తమ నూతన ఇన్నోవా క్రిస్టా కోసం బుకింగ్స్‌ను ప్రారంభించింది. 2005లో ఇన్నోవాను పరిచయం చేసిన నాటి నుంచి ఈ వాహనం భారతీయ మార్కెట్లో ఇంటి పేరుగా మారిపోయింది. దీనియొక్క సౌకర్యం, భద్రత, విశ్వసనీయత, విలాసం మరియు శక్తి పరంగా ఇది ప్రశంసనలను పొందింది. ఈ నూతన ఇన్నోవా క్రిస్టా ఇప్పుడు వృద్ది చేయబడిన ఫ్రంట్ ఫాసియాతో వస్తుంది. దీనిని రగ్డ్ మరియు ధృడమైన ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని తీర్చిదిద్దారు. తద్వారా భారతీయ కుటుంబాలు, వ్యాపారవేత్తలు, కార్పోరేట్స్ మరియు ఫ్లీట్ యజమానుల అవసరాలను తీర్చనుంది.
నూతన ఇన్నోవా క్రిస్టా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇటీవల విడుదల చేయగా, అసాధారణ స్పందన అందుకున్న ఇన్నోవా హై క్రాస్ (గ్యాసోలిన్ మరియు స్ట్రాంగ్ హై బ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్ట్రైన్స్లో లభ్యం)ను ఇది అనుసరిస్తుంది. దీనియొక్క గ్లామర్ కోషెంట్, అత్యాధునిక సాంకేతికత, సౌకర్యంతో పాటుగా భద్రత, డ్రైవ్ చేయడానికి ఉద్విగ్నపూరిత అనుభవాలను అందించడం వల్ల ప్రతి సందర్భానికీ తగిన వాహనంగా నిలిచింది. ఒంటరిగా లేదంటే కటుంబంతో కలిసి ప్రయాణించేందుకు అనువైన వాహనంగా నిలిచింది. నూతన ఇన్నోవా క్రిస్టా బుకింగ్స్, సరికొత్త ఇన్నోవా హై క్రాస్‌ను ఆవిష్కరణను అనుసరించడమన్నది వినియోగదారుల పట్ల టయోటా యొక్క మల్టీ టెక్నాలజీ విధానానికి నిదర్శనంగా నిలుస్తూనే డీజిల్ పవర్ట్రైన్ కోరుకునే వారి అవసరాలను తీర్చగలదు.
ఈ ప్రకటన గురించి టయోటా కిర్లోస్కర్ మోటర్ సేల్స్ అండ్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ మాట్లాడుతూ ‘‘ భారతదేశంలో ప్రతిష్టాత్మక ఇన్నోవా ప్రయాణం 2005లో ఆవిష్కరించిన నాటి నుంచి ఎన్నో మైలురాళ్లను అధిగమిస్తూ సాగింది. ఎదురులేనట్టి రీతిలో ఈ విభాగంలో నాయకునిగా కొనసాగడంతో పాటుగా, ఈ వాహనం , తన పూర్తి సరికొత్త అవతారంలో దేశవ్యాప్తంగా ప్రశంసలను పొందుతుంది మరియు నాణ్యత, మన్నిక మరియు విశ్వసనీయత వంటి లక్షణాలకు ప్రతి రూపంగా భారతీయ మార్కెట్లో వెలుగొందుతుంది. నేడు నూతన ఇన్నోవా క్రిస్టా కు బుకింగ్స్‌ను తెరువడంతో మేము మా వినియోగదారులకు వారు అభిమానించే ఎంపీవీ ని నాలుగు గ్రేడ్లలో అందిస్తున్నాము. రగ్డ్ మరియు ప్రాక్టికల్ వాహనం కోరుకునే వినియోగదారులకు ప్రాధాన్యతా వాహనం గా సాటిలేని సౌకర్యం మరియు భద్రతతో నిలుస్తుంది.
నూతన ఇన్నోవా క్రిస్టా మరియు ఇన్నోవా హైక్రాస్‌లు ఇప్పుడు బుకింగ్స్ కోసం డీలర్లు మరియు ఆన్లైన్లో లభిస్తున్నాయి. తమ అభిమాన ఇన్నోవాను కోరుకునే మా వినియోగదారుల కోసం ఇప్పుడు బహుళ పవర్‌ట్రైన్స్ ఆస్వాదించేందుకు అందుబాటులో ఉన్నాయని వెల్లడించేందుకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు, నేటితో ప్రారంభించి నూతన ఇన్నోవా క్రిస్టా ను 50వేల రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు డీలర్ ఔట్లెట్లు లేదా ఆన్లైన్లో టయోటాభారత్ డాట్ కామ్ వద్ద బుక్ చేసుకోవచ్చు. ఈ నూతన ఇన్నోవా క్రిస్టా నాలుగు గ్రేడ్లు జీ, జీఎక్స్, వీఎక్స్, జెడ్‌ఎక్స్‌లో ఐదు రంగులు – వైట్ పెరల్ క్రిస్టల్ షైన్, సూపర్ వైట్, సిల్వర్, అటిట్యూడ్ బ్లాక్ మరియు అవాంత్ గ్రేడ్ బ్రాంజ్‌లో లభ్యమవుతాయి.