Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిండెన్‌బర్గ్ భారీ దెబ్బ
ముంబయి : అదానీ గ్రూపు కంపెనీలు తీవ్ర మోసాలకు పాల్పడుతున్నాయని అమెరికన్ పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ రిపోర్ట్ దెబ్బకు గౌతం అదానీ ఊహించని నష్టాలు చవి చూశారు. స్టాక్ మార్కెట్లలో వరుస భారీ నష్టాలతో అదానీ టాప్ -10 కుబేరుల జాబితాలో చోటు కోల్పోయారు. కేవలం మూడు రోజుల్లోనే లక్షల కోట్ల రూపాయల విలువను నష్టపోయారు. దీంతో ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానం నుంచి ఏకంగా 11వ స్థానానికి దిగజారారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ మంగళవారం ఓ రిపోర్టులో తెలిపింది. 2023 జనవరి మాసంలో 36 బిలియన్ డాలర్ల (రూ.2.94 లక్షల కోట్లు) వ్యక్తిగత సంపదను నష్టపోయారు. ప్రస్తుతం ఆయన వ్యక్తిగత సంపద 84.4 బిలియన్ డాలర్ల (రూ.6.90 లక్షల కోట్లు)కు తగ్గిందని అని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. మూడు సెషన్లలో అదానీ గ్రూప్ సంస్థలు 25 శాతం మార్కెట్ విలువను కోల్పోయాయని వెల్లడించింది. 2022లో అదానీ అత్యధికంగా రూ.3.2 లక్షల కోట్ల సంపదను కూడబెట్టుకున్నారు. లక్షల కోట్ల సంపద కోల్పోయినప్పటికీ.. ఇప్పటికీ అదానీ భారత ధనవంతుల్లో ఒక్కటో స్థానంలో ఉన్నారు. ముకేష్ అంబానీ రూ.6.7 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ప్రపంచ కుబేరులతో పోల్చితే రిలయన్స్ అధినేత 13వ స్థానంలో ఉన్నారు. ''అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన కుటుంబ సభ్యులు గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఆ కంపెనీ షేర్లను మానిఫ్యులేషన్ చేస్తుంది. ఎకౌంట్స్‌లో మోసాలకు పాల్పడుతుంది. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచింది. పన్ను ఎగవేత, మనీలాండరింగ్ మోసాల కోసం అనేక అడ్డదారులు తొక్కింది. అప్పుల కోసం మోసాలకు పాల్పడింది. మూడేళ్ల క్రితం అదానీ సంపద రూ.1.62 లక్షల కోట్లుగా ఉండగా.. ఇటీవల రూ.10 లక్షల కోట్ల చేరువకు వెళ్లింది. జాతీయవాదం పేరుతో దేశాన్ని క్రమపద్దతిలో దోచుకుంటుంది.'' అని హిండెన్‌బర్గ్ రిపోర్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఎఫ్‌పీఓకు ఉద్యోగులు దూరం
అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ)కు రిటైల్ ఇన్వెస్టర్లు దూరంగా ఉన్నారు. హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో ఇందులో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహారించారు. జనవరి 31తో ముగిసిన ఈ ఇష్యూలో రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగుల కోసం 2.29 కోట్ల షేర్లను కేటాయించగా.. 11 శాతం మాత్రమే సబస్రయిబ్ అయ్యాయి. అదానీ గ్రూపు కంపెనీల ఉద్యోగులు కూడా ఈ ఇష్యూకు దూరంగా ఉన్నారని రిపోర్టులు వస్తున్నాయి. ఉద్యోగులు తమకు కేటాయించిన 1.6 లక్షల షేర్లలో 52 శాతం షేర్లకు మాత్రమే బిడ్లు దాఖలు అయ్యాయి. ఈ ఎఫ్‌పిఒతో అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ.20,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా.. 4.55 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 4.62 కోట్లకు బిడ్లు దాఖలయ్యాయి. నాన్ ఇన్స్‌ట్యూట్ ఇన్వెస్టర్లు, క్వాలిఫైడ్ ఇన్స్‌ట్యూషనల్ బయ్యర్స్ విభాగంలో ఎక్కువగా దరఖాస్తులు రావడంతో పూర్తిగా సబ్‌స్రయిబ్ అయ్యింది.