Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశంలో మెక్డొనల్డ్స్ను నిర్వహించే వెస్ట్‌లైఫ్ ఫుడ్వల్డ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 28.23 శాతం వృద్థితో రూ.611.46 కోట్ల నికర అమ్మకాలు నమోదు చేసింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.476.83 కోట్ల అమ్మకాలు చేసింది. ఇదే సమయంలో రూ.20.82 కోట్ల లాభాలు నమోదు చేయగా.. గడిచిన క్యూ3లో 74.69 శాతం వృద్థితో రూ.36.37 కోట్ల నికర లాభాలు సాధించింది. గడిచిన అక్టోబర్-డిసెంబర్ కాలంలో ఎప్పుడూ లేని విధంగా నెల వారి సగటు అమ్మకాలు రూ.200 కోట్లు దాటిందని తెలిపింది.