Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేకమైన ముహూరత్ లాంజ్ తో పూర్తి సరికొత్త షోరూమ్ నేపథ్యం పరిచయం ; వెడ్డింగ్ షాపర్ల కోసం వ్యక్తిగతీకరించిన షాపింగ్ అనుభవాలు
నవతెలంగాణ - హైదరాబాద్
భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే ఆభరణాల బ్రాండ్లలో ఒకటి కావడంతో పాటుగా అగ్రగామి ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన కళ్యాణ్ జ్యువెలర్స్ తమ నూతనంగా డిజైన్ చేసిన షోరూమ్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ప్రారంభించింది. ఇది ఎంజీరోడ్, పీడబ్ల్యుడీ గ్రౌండ్స్ ఎదురుగా ఉంది. ఈ పూర్తి సరికొత్త షో రూమ్ అత్యంత విలాసవంతమైన, పునరుద్ధరించబడిన షాపింగ్ అనుభవాలను వైవిధ్యమైన, ట్రెండీ ఆభరణాల డిజైన్లను ప్రదర్శించడం ద్వారా అందిస్తుంది. ఈ షోరూమ్ పునః ప్రారంభంతో, ఈ జ్యువెలరీ బ్రాండ్ వినూత్నమైన నేపథ్యం – స్పెషల్ ముహూర్త్ లాంజ్‌ను పరిచయం చేసింది. వెడ్డింగ్ షాపర్ల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సేవలను సైతం ఈ షోరూమ్‌లో అందిస్తున్నారు.
ఈ పూర్తి సరికొత్త షోరూమ్‌లో విస్తృత శ్రేణిలో ఆభరణాలను కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క కలెక్షన్స్ నుంచి అందిస్తున్నారు. ఈ జ్యువెలరీ బ్రాండ్ తమ అభిమానులకు అత్యంత అధునాతమైన సదుపాయాలు, ప్రపంచశ్రేణి వాతావరణం తో పాటుగా సాటిలేని అనుభవాలను సైతం అందిస్తామనే వాగ్ధానం చేస్తుంది. అత్యంత అనుభవశాలురు కావడంతో పాటుగా అపార పరిజ్ఞానం కలిగిన కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌లు కళ్యాణ్ జ్యువెలర్స్ వద్ద వినియోగదారులకు ఖచ్చితమైన ఆభరణాలను, వినియోగదారుల బడ్జెట్, శైలికి తగినట్లుగా ఎంపిక చేసుకునేందుకు తోడ్పడతారు. కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్ నేటి నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించనుంది. ఇక్కడ విస్తృత శ్రేణిలో సమకాలీన, సంప్రదాయ డిజైన్లు ప్రతి వినియోగదారుని అభిరుచి, ప్రాధాన్యతలకు అనుగుణంగా అందిస్తుంది.
ఈ నూతన షోరూమ్ ప్రారంభం గురించి కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ ‘‘ విజయవాడలో మా నూతనంగా పునరుద్ధరించబడిన షోరూమ్ ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద మార్కెట్లలో విజయవాడ మార్కెట్ ఒకటి. ఈ షోరూమ్‌తో సమగ్రమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడం లక్ష్యంగా చేసుకున్నాము. వైవిధ్యమైన వినియోగదారుల అవసరాలను ఇది తీర్చడంతో పాటుగా వారి కొనుగోలు అనుభవాలను సైతం మెరుగుపరచనుంది. మా ముహూర్త్ లాంజ్ సేవలు వెడ్డింగ్ షాపర్ల నడుమ అత్యంత ప్రాచుర్యం పొందగలవనే నమ్మకంతో ఉన్నాము. మా వినియోగదారులకు అత్యుత్తమమైనది అందిస్తామనే మా వాగ్ధానం నెరవేర్చడంతో పాటుగా రాబోయే కాలంలో నమ్మకం, నిజాయితీ అనే మా విలువలతో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించనున్నాము’’ అని అన్నారు
వినియోగదారులు ఇప్పుడు కళ్యాణ్ యొక్క నాలుగంచెల భరోసా సర్టిఫికేషన్‌ను బంగారం ఆభరణాలపై పొందగలరు. తమ బ్రాండ్ అభిమానులకు అత్యుత్తమ విలువను అందించాలనే నిబద్ధతను పునరుద్ఘాటించే క్రమంలో కళ్యాణ్ ఆరంభించిన ప్రత్యేక కార్యక్రమమిది. కళ్యాణ్ జ్యువెలర్స్‌లో విక్రయించే ఆభరణాలన్నీ కూడా బహుళ స్వచ్ఛత పరీక్షలను ఎదుర్కొంటాయి మరియు అన్నీ బీఐఎస్ హాల్‌మార్క్ ఆభరణాలు. నాలుగంచెల భరోసా సర్టిఫికెట్ వినియోగదారుల చెల్లింపుకు పూర్తి భరోసాను మార్పిడి లేదా రీసేల్‌పై అందిస్తుంది అంతేకాదు, ఆభరణాలపై ఉచిత జీవితకాలపు మెయిన్టెనెన్స్ను దేశంలోని కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్‌లలో అందిస్తుంది.
కళ్యాణ్ జ్యువెలర్స్ తమ అభిమానులకు ముహుర్త్, బ్రైడల్ జ్యువెలరీ లైన్‌ను అందిస్తుంది. దీనితో పాటుగా ప్రత్యేకమైన సెక్షన్స్‌లో కళ్యాణ్ యొక్క అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రాండ్లు అయినటువంటి తేజస్వి– పోల్కి ఆభరణాలు, ముద్ర – చేతితో రూపొందించిన యాంటిక్ జ్యువెలరీ, నిమాహ్– టెంపుల్ జ్యువెలరీ, గ్లో– డ్యాన్సింగ్ డైమండ్స్, జియా– సోలిటైర్ తరహా వజ్రాభరణాలు, అనోఖీ –అన్‌కట్ డైమండ్స్, అపూర్వ– ప్రత్యేక సందర్భాల కోసం వజ్రాలు, అంతర –వెడ్డింగ్ డైమండ్స్, హీరా డైలీ వేర్ డైమండ్స్ మరియు రంగ్– ప్రెసియస్ స్టోన్ జ్యువెలరీ ఉంటాయి. ఒక లక్షకు పైగా సమకాలీన మరియు సంప్రదాయ డిజైన్స్‌తో కూడిన పోర్ట్‌ఫోలియో నుంచి బ్రైడల్ వేర్, ఫెస్టివ్ వేర్ మరియు ప్రతిరోజూ ధరించేందుకు ఆభరణాలను వినియోగదారులు ఎంచుకోవచ్చు.