Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో రూ.293 కోట్ల నికర లాభాలు సాధించింది. నికర వడ్డీపై ఆదాయం పెరగడం, మొండి బాకీలకు కేటాయింపులు తగ్గడంతో ఆ బ్యాంక్ రాణించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.34 కోట్ల నష్టాలు చవి చూసింది. ఇదే సమయంలో రూ.154 కోట్లుగా ఉన్న నిర్వహణ లాభాలు.. క్రితం క్యూ3లో 153 శాతం పెరిగి రూ.389 కోట్లుగా నమోదయ్యాయి. గడిచిన త్రైమాసికంలో రూ.30వేల కోట్ల బ్యాలెన్ష్ షీట్ మార్క్‌ను చేరామని ఆ బ్యాంక్ ఎండీ, సీఈఓ ఎట్టిర డావిస్ పేర్కొన్నారు. క్రితం క్యూ3లో విజయవంతమైన ఫలితాలను నమోదు చేశామన్నారు.