Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7 ఈ-బస్సుల ఇండక్షన్‌తో స్థిరమైన గ్రౌండ్ కార్యకలాపాలను బలోపేతం చేసుకుంది
నవతెలంగాణ హైదరాబాద్: భారతదేశంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో, హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 150+ డైలీ డిపార్చర్లను సాధించడంలో మరో మైలురాయిని చేరుకుని, వేడుకలను నిర్వహించుకుంది. ప్రస్తుతం, ఇండిగో హైదరాబాద్ నుంచి దేశీయంగా 49 నగరాలకు ఢాకా, దోహా దుబాయ్, షార్జా, రియాద్, దమ్మామ్, మస్కట్, కువైట్ సిటీతో సహా అంతర్జాతీయంగా 8 నగరాలకు ప్రయాణ, రవాణా సేవలను అందిస్తోంది. హైదరాబాద్‌లో స్థిరమైన కార్యకలాపాలను బలోపేతం చేయడంలో భాగంగా, హైదరాబాద్ విమానాశ్రయంలో ఇండిగో జీరో కార్బన్ ఉద్గారాలతో 7 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. విమానయాన రంగంలో ఆచరణాత్మక పరిమితులను సమతుల్యం చేసే ఈఎస్జీ వ్యూహానికి ఇండిగో ఆశయం కట్టుబడి ఉంది. ఇండిగో 2021లో, గ్రౌండ్ సపోర్ట్ ఎక్విప్మెంట్ ఆటోమేషన్ ద్వారా ఉద్గారాలను తగ్గించింది. ప్యాసింజర్ మరియు ఫ్రైట్ సర్వీస్‌లలో ‘మాడిఫైడ్ బ్యాగేజ్ బీఎఫ్ఎల్ ఫర్ క్యాబిన్ లోడింగ్’ వంటి పరిష్కారాలను అనుసరిస్తూ, 20-టన్నులకు బదులుగా 10-టన్నుల ఎలక్ట్రికల్ టగ్ మరియు బ్యాటరీతో నడిచే బ్యాగేజ్ ఫ్రైట్ లోడర్‌ను ఉపయోగిస్తుంది.
ఈ సందర్భంలో ఇండిగో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ రాందాస్ మాట్లాడుతూ, “ఇండిగో ఇప్పుడు హైదరాబాద్ నుంచి 150+ డైలీ డిపార్చర్లతో విమానాలను నడుపుతుందని ప్రకటించడానికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. రాష్ట్రంలో యాక్సెసిబిలిటీ మరియు టూరిజం మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలనే ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఈ విమానాలు హైదరాబాద్‌కు ఇక్కడి నుంచి బయటి ప్రాంతాలకు వృద్ధి చెందుతున్న ప్రయాణ డిమాండ్‌ను తీర్చగలవు. భూతాపాన్ని తగ్గించే దిశలో ఇ-బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా మన కార్బన్ పాదముద్రను తగ్గించుకునే ప్రయత్నాలను కూడా చేపట్టడం కూడా మా సాధనగానే చెప్పవచ్చు. మా విస్తృత నెట్‌వర్క్‌లో సుస్థిరత, సరసమైన ఛార్జీలు, సమయానుకూల పనితీరు, మర్యాదపూర్వకమైన, అవాంతరాలు లేని సేవల వాగ్దానానికి సంబంధించి మా దృష్టికి కట్టుబడి ఉండేందుకు మేము నిరంతరం ప్రయత్నిస్తున్నాము’’ అని వివరించారు. భారతదేశంలో అత్యధికంగా బుక్ చేసుకునే వ్యాపార నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా అవతరించింది. హైదరాబాద్ నుంచి బుకింగ్‌లు ఏడాది నుంచి ఏడాదికి 100 శాతం పెరిగాయని పరిశ్రమ ఇటీవల విడుదల చేసిన నివేదికలో నివేదికలో పేర్కొంది. భారతీయ విమానయాన పరిశ్రమ 2023లో రికవరీ, వృద్ధిని సూచిస్తున్నందున, హైదరాబాద్ నుంచి 150+ డిపార్చర్లు నగరం నుంచి వృద్ధి చెందుతున్న ట్రాఫిక్ డిమాండ్, ప్రయాణికు సంఖ్యకు అనుగుణంగా సేవలు అందించడంలో సహాయపడుతోంది.