Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అజాద్ ఇంజనీరింగ్ వెల్లడి
హైదరాబాద్: ఫ్రాన్స్ అణు టర్బైన్లకు విడి పరికరాలను సరఫరా చేస్తున్నట్లు ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ ఆజాద్ ఇంజనీరింగ్ తెలిపింది. న్యూక్లియర్ టర్బైన్లకు అవసరయ్యే కీలక భాగాలను సరఫరా చేసినట్టు వెల్లడించింది. ఫ్రాన్స్‌లోని బెల్ఫోర్ట్లో అణు టర్బైన్లను అసెంబుల్ చేసేందుకు ఉపయోగపడే ఈ భాగాల మొదటి సెట్‌ను డెలివరీ చేసినట్టు పేర్కొంది. జిఇ స్టీమ్ పవర్ తో ఉన్న దీర్ఘకాలిక ఒప్పందం వల్లే, ప్రపంచ వ్యాప్తంగా న్యూక్లియర్ విభాగంలో పెద్ద వ్యాపార అవకాశాన్ని దక్కించుకున్నట్లు ఆజాద్ ఇంజినీరింగ్ ఎండి రాకేష్ ఛోప్దార్ తెలిపారు. ప్రపంచ మార్కెట్‌కు న్యూక్లియర్ విడిభాగాలు సరఫరా చేసిన తొలి భారతీయ కంపెనీ తమదేనని ఆజాద్ ఇంజినీరింగ్ ఎండీ రాకేష్ ఛోప్దార్ అన్నారు. అయిదేళ్ల పాటు తమ ప్రగతి ప్రస్తానం కొనసాగుతుందన్నారు. దేశంలో అణు విడిభాగాల తయారీకి ఆమోదం పొందిన మొదటి, ఏకైక కంపెనీ తమదే కావడం గర్వంగా ఉందన్నారు.