Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: స్టేట్ మైనింగ్ డిపార్ట్మెంట్ (రాష్ట్ర గనుల శాఖ) మరియు నేషనల్ హైవేస్ అథారిటీ తప్పనిసరిగా రాయల్టీ స్లిప్స్ అంశంలో అవకతవకలను అరికట్టాల ని సదరన్ రీజనల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఆర్సీఏ) కోరింది.
ఈ అసోసియేషన్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) రహదారులు, బ్రిడ్జిల అభివృద్ధి కోసం టెండర్లను అంతర్జాతీయ స్ధాయిలో పిలుస్తుంటుంది. టెండర్లు వేసే కంపెనీలు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులలో ఉపయోగించే కంకర, మట్టి, బ్లూ మెటల్స్ కోసం రాయల్టీ స్లిప్‌లను ఎన్హెచ్ఏఐకు అందించాలి అని వెల్లడించింది. రాష్ట్ర మైనింగ్ శాఖ క్రమంతప్పకుండా గ్రావెల్ సాయిల్, బ్లూ మెటల్స్ నాణ్యతను కాంట్రాక్టర్లకు రాయల్టీ స్లిప్‌లను అందించక మునుపే పరీక్షించాలి. ఉదాహరణకు ఓ 500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌కు 25 కోట్ల రూపాయల రాయల్టీ సర్టిఫికెట్ అవసరం ఉంటుంది. కానీ కంపెనీలు 5 కోట్ల రూపాయల రాయల్టీ సర్టిఫికెట్ జారీ చేసి, మరో 20 కోట్ల రూపాయల నకిలీ రాయల్టీ సర్టిఫికెట్‌ను స్టేట్ మైనింగ్ డిపార్ట్మెంట్ పేరిట సృష్టించి ఎన్హెచ్ఏఐకు సమర్పిస్తున్నాయి.
ఈ కారణంగా ప్రభుత్వం కోట్లాది రూపాయల ఆదాయం నష్టపోతుంది. జాతీయ స్థాయిలో, నిబంధనల అతిక్రమణ, ప్రభుత్వానికి ఆదాయ నష్టం, ఈ నకిలీ రాయల్టీ సర్టిఫికెట్ల ద్వారా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర, కర్నాటక,కేరళ, మధ్యప్రదేశ్‌లలో అధికంగా జరుగుతుంది. ఈ అక్రమ కార్యకలాపాల పట్ల చర్యలను తీసుకోవాల్సిందిగా ఎస్ఆర్సీఏ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతుంది. ప్రస్తుతం, ఎన్హెచ్ఏఐకు సమర్పిస్తున్న రాయల్టీ స్లిప్‌లలో 25% మాత్రమే అసలైనవి. మిగిలినవన్నీ నకిలీ మరియు సృష్టించిన కంపెనీలకు చెందినవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లా ఎన్ఫోర్శ్మెంట్ ఏజెన్సీలు ఈ సమస్యను పరిశీలించడంతో పాటుగా ఈ అక్రమాలకు పాల్పడిన కంపెనీలను విచారించాలి. రాష్ట్ర మైనింగ్ శాఖతో పాటుగా నేషనల్ హైవేస్ అథారిటీ తప్పనిసరిగా పర్యవేక్షణ ప్రక్రియ ప్రారంభించాలి. అలాగే రాయల్టీ స్లిప్స్ అంశంలో అవకతవకలను నిరోధించాలి అని ఎస్ఆర్సీఏ ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్తుకుమార్ సూచించారు.