Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐడీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ తాము ఐడీఎఫ్సీ క్రిసిల్ ఐబీఎక్స్ గిల్ట్ – ఏప్రిల్ 2032 ఇండెక్స్ ఫండ్‌ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఇది ఓపెన్ ఎండెడ్ టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్. క్రిసిల్ ఐబీఎక్స్ గిల్ట్ ఇండెక్స్ –ఏప్రిల్ 2032లో ఇది పెట్టుబడులు పెడుతుంది. ఈ ఎన్ఎఫ్ఓను ఫిబ్రవరి 06, 2023 న తెరిచారు. ఫిబ్రవరి 14, 2023 న మూసివేస్తారు. పెట్టుబడులను లైసెన్స్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లతో పాటుగా నేరుగా https://idfcmf.com/ ద్వారా పెట్టవచ్చు. తమ పోర్ట్‌ఫోలియోలో టార్గెట్ మెచ్యూరిటీ గిల్ట్ ఇండెక్స్‌ను మదుపరులు ఎందుకు పరిశీలించాలనే అంశమై ఐడీఎఫ్సీ ఏఎంసీ సీఈఓ విశాల్ కపూర్ వెల్లడిస్తూ ‘‘తరచుగా పెట్టుబడులు పెట్టే మదుపరులు తమ ఫిక్స్డ్ ఇన్కమ్ పోర్ట్‌ఫోలియోను వ్యూహాత్మకంగా తమ పెట్టుబడుల కేటాయింపు విధానంతో వైవిధ్యీకరించాలనుకుంటారు. ఇది నాణ్యత, స్థిరత్వం, లిక్విడిటీని సమతూకం చేయడంతో పాటుగా సంప్రదాయ ఫిక్స్డ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో పోలిస్తే అధిక రాబడులనూ అందిస్తుంది. గత సంవత్సర కాలంగా వడ్డీరేట్లు పెరుగుతుండటం, దీర్ఘకాలపు రాబడులు సైతం పైకి ఎగుస్తుండటంతో దీర్ఘకాలంగా పొదుపు చేస్తున్న వారికి చక్కటి అవకాశమూ లభిస్తుంది. టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్ మదుపరులకు ఆకర్షణీయమైన రాబడుల నుంచి ప్రయోజనం పొందే అవకాశం అందిస్తుంది. దీనితో పాటుగా మెచ్యూరిటీ వరకూ పెట్టుబడులను ఉపసంహరించని మదుపరులకు చక్కటి రాబడులూ లభించవచ్చు. ఐడీఎఫ్సీ క్రిసిల్ ఐబీఎక్స్ గిల్ట్–ఏప్రిల్ 2023 ఇండెక్స్ ఫండ్ ఈ దీర్ఘకాలపు మదుపరులకు ఓ చక్కటి పరిష్కారం. ఇది అతి సులభమైన, ప్రభావవంతమైన మార్గంలో సావరిన్ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టేందుకు మార్గంగా నిలుస్తుంది’’ అని అన్నారు.