Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్కీ సదస్సులో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
విద్యుదుత్పత్తిలో కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించాలని పవర్ ఒరాకిల్ ఎనర్జీ అండ్ వాటర్ విభాగాధిపతి మాట్ ఓ కీఫ్ అన్నారు. ఆస్కీ ఆధ్వర్యంలో మంగళవారం 'శక్తి పరివర్తన-ఉద్గారాల నియంత్రణ ఆవి ష్కరణలు- సాంకేతికత పాత్ర' అంశంపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగానికి ప్రధాన్యత పెరుగుతున్నదని చెప్పారు. సంప్రదాయేతరంగా విద్యుదుత్పత్తికి క్రిష్టలైన్ సిలికాన్ సోలార్ పీవీ మోడల్స్, లెడ్ ప్యాకేజెస్, విండ్ టర్బైన్ కాంపోనెంట్స్, లిథియం కార్బన్ బ్యాటరీలు వినియోగిస్తున్నారని తెలిపారు. అయితే వీటి తయారీ ద్వారా పర్యావరణంలో కలుస్తున్న కర్బన్ ఉద్గారాలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయని చెప్పారు. సాంకేతికతను మరింత ఆధునీకరించాల్సిన అవసరం ఉన్నదనీ, ఇంధన రంగంలో మరిన్ని నూతన ఆవిష్కరణలు రావాలని ఆకాంక్షించారు. దీనికోసం విద్యాసంస్థలకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమానికి ఆస్కీ చైర్మెన్ పద్మనాభయ్య అధ్యక్షత వహించారు.