Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్లూస్టార్ యండీ త్యాగరాజన్ వెల్లడి
హైదరాబాద్ : భారత ఏసీ మార్కెట్లో బ్లూ స్టార్‌కు 13.5 శాతం మార్కెట్ వాటా ఉందని ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ త్యాగరాజన్ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25 కల్లా 15 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా పెట్టుకున్నామ న్నారు. ప్రముఖ ఏసీ ఉత్పత్తుల కంపెనీ బ్లూ స్టార్ తన నూతన ప్లాంటును శ్రీసిటీలో ప్రారంభిం చింది. ఈ సందర్బంగా ఇక్కడ ఆయన ఆ కంపెనీ ప్రెసిడెంట్ శశి అరోరాతో కలిసి మీడియాతో మాట్లా డుతూ.. ఏడాదికి 3 లక్షల రూమ్ ఏసీ యూనిట్ల తయారీ సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను జనవరిలో లాంఛనంగా ప్రారంభించినట్లు తెలిపారు. రూ.350 కోట్ల పెట్టుబడితో తొలి దశ కార్యకలాపాలు మొదలయ్యాయని అన్నారు. ఈ కొత్త ప్లాంటుతో రూమ్ ఏసీ తయారీ సామర్థ్యం 6 లక్షల యూనిట్లకు చేరిందన్నారు. మరో రూ.200 కోట్లతో శ్రీసిటీలోని ప్లాంటును విస్తరిస్తామన్నారు. ఇందుకోసం శ్రీసిటీలో మరో 40 ఎకరాలు స్థలం కొనుగోలు చేశామన్నారు. 2027 నాటికి 12 లక్షల యూనిట్ల సామర్థ్యానికి చేర్చనున్నామన్నారు.