Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ:ప్రముఖ డిజిటల్ చెల్లింపు ల వేదిక ఫోన్ పే మరో అడుగు ముందు కేసి విదేశాల్లోనూ చెల్లింపులకు అనుమతిస్తున్న ట్టు వెల్లడించింది. విదేశీ ప్రయాణాలు చేసే భారతీయుల కోసం పలు దేశాల్లోనూ యూపీఐ పేమెంట్స్‌ను ప్రారంభించి నట్టు మంగళవారం ఆ సంస్థ వెల్లడించింది. స్థానిక క్యూఆర్ కోడ్ గల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఐ), సింగపూర్, మారిషస్, నేపాల్, భూటాన్ దేశాల్లోని వ్యాపార స్తుల వద్ద చెల్లింపులకు తమ యాప్ మద్దతు చేయనుందని తెలిపింది. ఆ దేశాల్లో పర్యటిస్తున్న వారు ఫోన్‌పే ద్వారా తమ భారతీయ బ్యాంక్ ద్వారా విదేశీ కరెన్సీలో నేరుగా చెల్లింపులు చేయ వచ్చని పేర్కొంది. ఈ సౌకర్యం కల్పిస్తున్న తొలి ఇండియన్ ఫిన్‌టెక్ యాప్ ఫోన్‌పే కావడం విశేషం.