Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల సంస్థ జీబ్రానిక్స్ తన కంపెనీకి చెందిన తాజా స్మార్ట్‌వాచ్‌ను ఆవిష్కరించింది. ఈ జీబ్రానిక్స్ ఐకానిక్ అల్ట్రా స్మార్ట్‌వాచ్‌లో కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. స్మార్ట్ వాచ్ ఆవిష్కరణ కార్యక్రమంలో డైరెక్టర్ యష్ దొషి పాల్గొని మాట్లాడారు. వినియోగదారుల లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా తమ పరికరాలను ఆవిష్కరిస్తామని చెప్పారు. ఈ స్మార్ట్‌వాచ్ కూడా అలాంటిదేనని అన్నారు. ఈ స్మార్ట్ వాచ్ 1.78 ఇంచుల అమోల్డ్ డిస్ప్లేను కలిగి ఉన్నది. 2.5డి లామినేటెడ్ స్క్రీన్‌ను కలిగి ఉన్నది. ఇందులో 9 ఇన్‌బిల్ట్ అప్లికేషన్లు ఉంటాయి. వందకు పైగా కస్టమైజ్డ్ అప్లికేషన్లకు అవకాశం ఉంటుంది. అమెజాన్‌లో దీని ప్రారంభ ధర రూ. 3299 గా అందుబాటులో ఉన్నది.