Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) హైదరాబాద్ లోని ఎఫ్‌టిసిసిఐలో ఎంఎస్ఎంఇ కస్టమర్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఎంఎస్ఎంఇలోని వివిధ విభాగా లకు చెందిన వ్యాపారస్తులకు మద్దతును ఇవ్వడానికి దీనిని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి పిఎన్‌బి హైదరాబాద్ జోనల్ హెడ్ మహ్మాద్ మక్సూద్ అలీ, సర్కిల్ హెడ్ ఎన్విఎస్ రెడ్డి, బ్యాంక్ అధికారులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్బార్ అభియన్ ఎంఎస్ఎంఇలకు మద్దతును ఇస్తుందని మక్సూద్ అలీ పేర్కొన్నారు. బ్యాంక్ ఎంఎస్ఎంఇలకు అందిస్తున్న పలు పథకాలను ఆయన వివరించారు. ఈ మీటింగ్‌కు 80 మంది ఎంఎస్ఎంఇ రుణ గ్రహీతలు హాజరయ్యారు. రూ.70 కోట్ల రుణాలకు గాను ప్రతిపాదనలు ఇచ్చారు. పలు పథకాల కింద రూ.40 కోట్ల ఎంఎస్ఎంఇ రుణాల జారీకి అనుమతించారు.